టెన్తు - ఇంటర్మీడియట్ - ఎంసెట్ - ఐఐటీ పరీక్షల ఫలితాల కంటే కూడా ఎక్కువ టెన్షన్ వాతావరణం ఏర్పడింది తెలుగు రాష్ట్రాల్లో. ప్రధాని మోడీ దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలకు ర్యాంకింగులు ప్రకటిస్తారన్న వార్తలు వస్తుండడం.. ఆ ర్యాంకుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ తొలి స్థానంలో ఉన్నారని తెలుస్తుండడంతో ఏపీ సీఎం చంద్రబాబు - ఆయన పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైందట. తమ కాంపిటీటర్ కు ఫస్టు ర్యాంకు రావడం ఒకెత్తయితే.. నిన్న మొన్నటి వరకు అనుకున్న 5వ ర్యాంకు కూడా తమకు దక్కలేదని తాజా కథనాలు వస్తుండడంతో చంద్రబాబులో కొత్త టెన్షన్ మొదలైందని చెబుతున్నారు. నిన్నమొన్నటి వరకు చంద్రబాబు ర్యాంకు 5 అని.. అంత తక్కువ ర్యాంకు రావడంపై ఆయన బాగా ఫీలవుతున్నారని అనుకున్నారు. కానీ.. తాజాగా ఆయన ర్యాంకు 13 అని వినిపిస్తోంది. దీంతో ఆయన మరింత డీలా పడిపోయారట. అయితే.. రాజకీయవర్గాల్లో రచ్చ చేస్తున్న ఈ ర్యాంకులు ఎంతవరకు నిజమన్న విషయంలో మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. మోడీ అధికారికంగా ప్రకటిస్తే తప్ప ఎవరిది ఏ ర్యాంకో తెలియదు.
సెంట్రల్ గవర్నమెంటు అధికారుల నుంచి వస్తున్న లీకుల ప్రకారం మాత్రం కేసీఆర్ కి ఫస్టు ర్యాంకు అని తెలుస్తోంది. ఆ తరువాత మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ 2వ స్థానంలో.. ఛత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ మూడో స్థానంలో ఉన్నారు. గుజరాత్ సీఎం ఆనందిబెన్ పటేల్ కు నాలుగు... కేజ్రీవాల్ కు అయిదో స్థానం దక్కాయి. కేజ్రీవాల్ అయిదులో ఉండడంతో చంద్రబాబు అయిదో స్థానంలో లేరని తేలిపోయింది. దీంతో చంద్రబాబు ర్యాంకు ఎంత అని ఆరా తీస్తే 13 అని వినిపిస్తోంది. బిజెపిని వ్యతిరేస్తూ, తరచూ మీడియాకెక్కుతున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఐదవ స్థానం లభించడం ప్రస్తావనార్హం. బిజెపి సీఎం వసుంధరరాజే సింధియాకు 7వ స్థానం - జార్ఖండ్ బిజెపి ముఖ్యమంత్రి రఘువర్ ప్రసాద్ కు 14వ స్థానం లభించాయి. ఈనెల 16న ర్యాంకులపై అధికార ప్రకటన చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.
కాగా దేశంలోని సిఎంల పనితీరుపై ప్రధాని మోదీ ప్రతి మూడు నెలలకోసారి త్రైమాసిక నివేదికలు తెప్పించుకుంటున్నారు. ప్రభుత్వ నిఘా సంస్థలతోపాటు - ప్రైవేటు ఏజెన్సీల ద్వారా కూడా ఈ సర్వేలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో సంతృప్తస్థాయి ప్రాతిపదికన ఈ సర్వే నివేదికలు ఇస్తారని చెబుతున్నారు. ఆ ప్రకారం తాజా త్రైమాసిక సర్వే నివేదిక ప్రకారం.. దేశంలో ప్రజాభిమానం సంపాదించుకున్న ముఖ్యమంత్రుల్లో - తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి స్ధానం సాధించారని వినిపిస్తోంది.