క్లారిటీ ఇచ్చేశారు.. ఓడినోళ్ల‌కు నో ఛాన్స్!

Update: 2018-12-13 03:41 GMT
కేసీఆర్ మ‌న‌సు ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. త‌న‌కు తోచిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం.. దానికి ఎవ‌రో ఏదో అనుకుంటార‌న్న అన‌వ‌స‌ర‌మైన అంశాల్ని పెద్ద‌గా ప‌ట్టించుకోరు. మ‌న‌సుకు న‌చ్చితే ఆకాశానికి ఎత్తేయ‌టం.. తేడా వ‌స్తే పాతాళానికి తొక్కేసే విష‌యంలో ఎలాంటి శ‌ష‌బిష‌లకు తావివ్వ‌రు. మ‌రి.. అలాంటి కేసీఆర్ త‌న‌కు అత్యంత న‌మ్మ‌క‌స్తులు.. జిగిరీ అయిన నేత‌లు కొంద‌రు ఈసారి ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌య్యారు. మ‌రి.. వారి విష‌యంలో ఆయ‌న ఎలా రియాక్ట్ కానున్నారు?

ఓట‌మి బాధ‌లో ఉన్న నేత‌ల్ని తాను ప‌లుక‌రించి.. పరామ‌ర్శించిన‌ట్లుగా తొలి రోజు చెప్పిన కేసీఆర్.. వారికేం చేయాలో అవ‌న్నీ చేస్తామ‌ని చెప్ప‌టం తెలిసిందే. తాజాగా.. ఈ విష‌యంపై క్లారిటీ ఇచ్చేశారు. ఉన్న‌త ప‌ద‌వుల్లో ఉండి.. ప్ర‌స్తుతం జ‌రిగిన‌ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన వారి విష‌యంలో తానేం చేయ‌లేన‌న్న విష‌యాన్ని త‌న మాట‌ల‌తో చెప్పేశారు. ఈ ఎన్నిక‌ల్లో దుర‌దృష్ట‌వ‌శాత్తు అసెంబ్లీ స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి ఓడిపోయార‌ని.. కొత్త స్పీక‌ర్ ను వెతుక్కోవాల్సి వ‌స్తోంద‌న్నారు.

కొత్త మంత్రివ‌ర్గంపై క‌స‌ర‌త్తు స్టార్ట్ చేయ‌లేద‌న్న ఆయ‌న‌.. జిల్లాలు.. కులాల వారీగా మంత్రి ప‌ద‌వులు భ‌ర్తీ చేయాల్సి ఉంటుంద‌న్న విష‌యాన్ని చెప్పారు. ఇప్ప‌టికి మంత్రివ‌ర్గ కూర్పును షురూ చేయ‌లేద‌న్న ఆయ‌న‌.. అందుకు నాలుగైదు రోజులు ప‌ట్టొచ్చ‌న్న విష‌యాన్ని చెప్పారు. ఓడిపోయిన వారికి వెంట‌నే ప‌ద‌వులు ఇస్తే విమ‌ర్శ‌లు వ‌స్తాయ‌ని చెప్పారు.

గెలుపు బ‌య‌ట‌కు చాలా గొప్ప‌గా ఉన్న‌ప్ప‌టికీ లోప‌ల క‌నిపించ‌ని అనేక ఇబ్బందులు ఉంటాయంటూ న‌వ్వుతూ చెప్పిన కేసీఆర్ మాట‌లు ఆస‌క్తిక‌రంగా మారాయ‌ని చెప్పాలి. ఓడినోళ్ల‌కు ప‌ద‌వులు ఇచ్చే విష‌యంలో కేసీఆర్ తాజాగా ఒక క్లారిటీతో ఉన్నార‌ని చెప్పాలి. ప‌ద‌వుల్ని ఆశిస్తున్న వారి సంఖ్య అంత‌కంత‌కూ ఎక్కువ అవుతున్న వేళ‌.. దానికి విరుగుడు మంత్రంగా జ‌నం అనుకుంటారంటూ చెబుతున్న కేసీఆర్ మాట‌ల్ని చూస్తే.. ఓడిన సీనియ‌ర్ల భారాన్ని దించుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. దీంతో.. ఓడిన వారికి ప‌ద‌వులు కాదు.. ప‌రామ‌ర్శ‌తో స‌రిపెట్టుకోవాల్సి ఉంద‌న్న విష‌యంపై క్లారిటీ వ‌చ్చేసిన‌ట్లే.


Tags:    

Similar News