ఓపక్క డెంగీ జ్వరాలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న పరిస్థితి. మరోవైపు 26 రోజులకు పైనే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. మరోవైపు.. సమ్మె విషయంలో ప్రభుత్వం తీరును హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇలాంటివేళ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అన్న ప్రశ్నలు వేసుకుంటే.. వచ్చే ఆన్సర్ ఆసక్తికరంగానే కాదు..ఆశ్చర్యానికి గురి చేయక మానదు.
సాధారణంగా ప్రశాంతత కోసం.. విరామం కోసం.. ఆట విడుపు కోసం ఫామ్ హౌస్ కు వెళుతుంటారు ప్రముఖులు. కానీ.. పరిస్థితి అంతా గందరగోళంగా ఉన్న వేళలో ఫామ్ హౌస్ కు వెళ్లటానికి ఇష్టపడరు. అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం.. ఫామ్ హౌస్ కు వెళుతున్న తీరు అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
నిన్నటికి నిన్న విషయాన్నే చూస్తే.. తాము చేస్తున్న సమ్మె విషయంలో కేసీఆర్ ప్రభుత్వ తీరును తప్పు పడుతూ సకలజనుల సమరభేరి సభను ఏర్పాటు చేశారు. ఇంకోవైపు ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం దాఖలు చేస్తున్న కౌంటర్లను హైకోర్టు తప్పు పడుతుంది. ఇలాంటివేళ.. ఇష్యూలను ఒక కొలిక్కి తీసుకురావాల్సిన ముఖ్యమంత్రి.. అందుకు భిన్నంగా ఫామ్ హౌస్ కి వెళ్లటం అందరిని అవాక్కు అయ్యేలా చేస్తుంది.
కీలకమైన వేళలో రాజధానిలో ఉండకుండా ఫామ్ హౌస్ కు వెళ్లటం దేనికి నిదర్శనమన్న చర్చ జరుగుతోంది. ఇదే అంశం మీద ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఫాంహౌస్ వెళ్లటాన్ని ఆయన తనదైన శైలిలో విశ్లేషించారు. తన మీద ఎలాంటి ఒత్తిడి లేదన్న విషయాన్ని చెప్పాలనుకోవటం.. సమ్మె అంశాన్ని తాను ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వటం లేదన్న సంకేతాన్ని ఇవ్వటం కోసమే ఇలాంటివి చేస్తున్నారన్నారు.
ఒత్తిడి లేదని ఫామ్ హౌస్ కు వెళ్లటం ద్వారా చెప్పటం బాగానే ఉన్నా.. ఇలాంటివి ప్రజల మనసుల్లో నెగిటివ్ ఫీలింగ్ ను మరింత పెంచే అవకాశం ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదంటున్నారు. తన మాటలతోనే కాదు.. చేతలతో కూడా కేసీఆర్ తనదైన విలక్షణతను ప్రదర్శిస్తున్నారని చెప్పక తప్పదు.