తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు మరో షాకిచ్చింది కేసీఆర్ సర్కార్. ఇప్పటికే అసైన్డ్ భూముల వ్యవహారంలో మంత్రి పదవి నుంచి ఈటల రాజేందర్ ను తప్పించిన విషయం తెలిసిందే. తాజాగా మరో వ్యవహారంలో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి.
తాజాగా ఈటల రాజేందర్ భార్య పేరిట ఉన్న జమున హేచరీస్ కు అటవీశాఖ ఇప్పుడు నోటీసులు పంపింది. జమున హేచరీస్ కు రోడ్డు వేసేందుకు చెట్లను నరికారని అందులో పేర్కొంది. అనుమతి లేకుండా సుమారు 237 చెట్లను నరికారని నిర్ధారించారు. ఈ వ్యవహారంలో సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ నోటీసులపై మూడు రోజుల్లోగా సరైన సమాధానం రాకపోతే వాల్టా చట్టం కింద కేసులు పెడుతామని నోటీసుల్లో స్పష్టం చేశారు.
ఈటల రాజేందర్ భూకబ్జా ఆరోపణలపై విచారణ జరుపుతున్న ఈ సమయంలో అటవీశాఖ ఇప్పుడు చెట్లను నరికారని నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.