ద‌టీజ్ కేసీఆర్‌...23,494 కొత్త పోస్టులకు ఓకే

Update: 2017-01-26 07:20 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏం చేసినా భారీగానే ఉంటుంద‌నేందుకు మ‌రో ఉదాహ‌ర‌ణ ఇది. ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లో భాగంగా హామీ ఇచ్చిన కేజీ టు పీజీ కోసం గురుకులాల్లో నియామకాలకు కేసీఆర్ ఉదారంగా అనుమ‌తి ఇచ్చారు. తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కేజీ టు పీజీ ఉచిత విద్యావిధానంలో భాగంగా నెలకొల్పుతున్న గురుకుల పాఠశాలలకు మొత్తం 23,494 ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో వచ్చే విద్యాసంవత్సరం కోసం 8,245 పోస్టుల భర్తీకి సత్వరమే నోటిఫికేషన్ వెలువరించాలని ఆదేశించారు. ఈ నియామకాలను టీఎస్‌ పీఎస్సీ ద్వారా చేపట్టనున్నారు. ఈ నిర్ణ‌యం తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాంకు షాక్ వంటిద‌ని చెప్తున‌నారు.

రాష్ట్రంలో పెద్దఎత్తున ఎస్సీ - ఎస్టీ - బీసీ - మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లను స్థాపిస్తున్నామని, ఇందులో అత్యుత్తమ బోధన జరుగాలన్నది ప్రభుత్వ లక్ష్యమని కేసీఆర్‌ చెప్పారు. ఈ నాలుగు విభాగాల్లో కొత్తగా మొత్తం 726 రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించాలని నిర్ణయించామని, ఇప్పటికే కొన్ని పాఠశాలలు మొదలయ్యాయని సీఎం తెలిపారు. ఇందుకు అనుగుణంగా స్కూళ్లలో తరగతులు పెరుగుతున్న కొద్దీ ఉద్యోగుల నియామకం జరుగాలని చెప్పారు. ప్రతి ఏడాది అవసరాన్నిబట్టి ఉద్యోగులను నియమించడానికి సీఎం అంగీకరించారు. 2017-18 విద్యాసంవత్సరానికి మొత్తం 8,245 మంది ఉద్యోగులను తక్షణం నియమించాలని ఆదేశించారు. దీనికోసం వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని, టీఎస్‌ పీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. ఎస్సీల కోసం కొత్తగా స్థాపించే 104 రెసిడెన్షియల్ స్కూళ్లలో 3,090 మంది, 30 డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీల్లో 1500 మంది - ఇప్పటికే నిర్వహిస్తున్న 98 ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్లలో అవసరమైన 3920 మందిని, వెలుగు ప్రాజెక్టు కింద పనిచేసే 36 ఎస్సీ స్కూళ్లలో 778 మందిని, కొత్తగా స్థాపించే 51 ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 1554మందిని నియమించనున్నట్లు తెలిపారు.ఇప్పటికే నడుస్తున్న 65 ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 1939 మంది, కొత్తగా స్థాపించే 119 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 3570 మంది, ఇప్పటికే నడుస్తున్న 23 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 745 మంది - కొత్తగా స్థాపించే 118 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 4337 మంది  - ఇప్పటికే ప్రారంభమైన 82 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 2063 మంది ఉద్యోగులు అవసరమని నిర్ణయించారు. దీనికి అనుగుణంగానే నియామకాలు చేపట్టాలని సీఎం సూచించారు. మొత్తం 23,494 పోస్టులకుగాను 20,299 పోస్టులు బోధన - 3185 బోధనేతర సిబ్బందిగా నిర్ణయించారు.

ఇదిలాఉండ‌గా తెలంగాణ‌లో ఉద్యోగాల భ‌ర్తీ జ‌ర‌గ‌డం లేద‌ని పేర్కొంటూ త్వ‌ర‌లో విద్యార్థుల‌తో మ‌హా ర్యాలీ చేప‌ట్టేందుకు తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం సిద్ధ‌మ‌య్యారు. కాంగ్రెస్ - టీడీపీ - వామ‌పక్షాలు స‌హా ఇత‌ర పార్టీల నేత‌ల‌ను ఇందులో క‌లుపుకునేందుకు కేసీఆర్ సిద్ధ‌మ‌య్యారు. అయితే కోదండ‌రాం ఇలా స‌ర్వ‌స‌న్న‌ద్ధం అవుతున్న ద‌శ‌లోనే అనూహ్య రీతిలో భారీగా 23,494 పోస్టుల‌కు కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో నిరుద్యోగుల్లో మునుప‌టి వేడి ఉంద‌ని చెప్తున్నారు. త‌ద్వారా కోదండ‌రాం ఊహించ‌ని నిర్ణ‌యాన్ని త‌న భారీత‌నంతో చాటుకున్నార‌ని పేర్కొంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News