కేసీఆర్ తలచుకున్నాడు, అయిపోయింది !

Update: 2022-06-25 11:30 GMT
రాజ‌కీయం ఎలా ఉన్నా, మైలేజీలు, డ్యామేజీలూ ఎలా ఉన్నా తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నారు. సికింద్రాబాద్ అల్ల‌ర్ల‌లో భాగంగా రైల్వే పోలీసుల కాల్పుల్లో వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన దామెర రాకేశ్ ప్రాణాలు కోల్పోయారు.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న త‌మ్ముడికి  ఉద్యోగం ఇచ్చి,  ఆ కుటుంబాన్నిఆదుకున్నారు. దీంతో కేసీఆర్ చెప్పిన విధంగానే బాధిత కుటుంబాన్ని స‌త్వ‌ర‌మే ఆదుకున్నార‌ని జనం అంటున్నారు.
 
ఓ విధంగా బాధిత కుటుంబానికి ఇదొక గొప్ప ఉప‌శ‌మ‌నం అనే చెప్పాలి.  ఇప్ప‌టికే రాకేశ్ కుటుంబానికి పాతిక ల‌క్ష‌ల రూపాయ‌ల ఎక్స్ గ్రేషియా కూడా ప్ర‌క‌టించారు కేసీఆర్. ఈ రెండు చర్య‌లూ బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నాయనే చెప్పాలి.

రాకేశ్ సోద‌రుడు  రామ‌రాజుకు కారుణ్య నియామాకాల్లో భాగంగా సీఎస్ పోస్టింగ్ ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చారు. సంబంధిత నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌రంగ‌ల్ జిల్లాలోనే ఆయ‌న‌కు పోస్టింగ్ ఇవ్వాల‌ని సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేయ‌డంతో బాధిత కుటుంబాల్లో ఆనందం వ్య‌క్తం అవుతోంది.

సాధారణంగా ఒక్క ఆర్మీ అధికారి సంతోష్ విషయంలో తప్ప మిగతా హామీలన్నీ కేసీఆర్ బాగా ఆలస్యం చేశారు. కానీ గ‌తంలో మాదిరిగా కాకుండా సంతోష్ కుటుంబం లాగే  కేసీఆర్ ఈ విష‌య‌మై ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్న వైనం పై నెటిజ‌న్లు  కూడా ప్ర‌శంసిస్తున్నారు.

అదేవిధంగా  యువ‌త కూడా అల్ల‌ర్ల‌కు దూరంగా, సంయ‌మ‌నం పాటిస్తూ నిర‌స‌న‌లు తెల‌పాల‌ని  కోరుతున్నారు.
Tags:    

Similar News