ఆసక్తికర పరిణామం ఒకటి తాజాగా చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు గవర్నర్ తమిళ సై మధ్య గత గవర్నర్ తో ఉన్నట్లుగా చక్కటి వాతావరణం లేదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది.దీనికి తగ్గట్లే.. గతంలో ఉన్న గవర్నర్ ను తరచూ కలిసేందుకు రావటమే కాదు.. గంటల కొద్దీ సమయాన్ని గడిపేవారు. వారి సంభాషణల్లో బోలెడన్ని విషయాలు వచ్చేవని చెబుతారు. అలాంటిది గవర్నర్ గా తమిళ సై నియమితురాలైన తర్వాత మాత్రం రాజ్ భవన్ కు ఎంతో అవసరం ఉంటే తప్పించి సీఎం కేసీఆర్ రావటం లేదన్నది తెలిసిందే.
దీనికి తోడు.. ప్రభుత్వంపై విమర్శలు చేసే విషయంలోనూ గవర్నర్ తమిళ సై యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటివేళ.. గవర్నర్ భర్తను సీఎం కేసీఆర్ సన్మానించిన వైనం ఆసక్తికరంగా మారింది. ఇంతకూ గవర్నర్ భర్తను కేసీఆర్ ఎందుకు సన్మానించినట్లు? అన్న విషయంలోకి వెళితే.. తాజాగా ఆయనకు ద్రోణాచార్య పురస్కారం లభించింది. దీంతో.. ఆయన్ను అభినందించేందుకు రాజ్ భవన్ కు వెళ్లారు కేసీఆర్.
తమిళ సై భర్త సౌందర్ రాజన్ తమిళనాడు వైద్య కళాశాలలో వైద్య అధ్యాపకుడిగా పదిహేనేళ్లు.. రామచంద్రా వైద్య కళాశాలలో 20 ఏళ్ల పాటు నెఫ్రాలజీ విభాగాధిపతిగా సేవలు అందించారు. ఆయన సర్వీసు కాలంలో ఏకంగా 1200 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సల్నివిజయవంతంగా నిర్వహించారు.
అంతేకాదు.. ప్రపంచంలో పాముకాటుతో మరణించిన వ్యక్తి నుంచి సేకరించిన కిడ్నీలను విజయవంతంగా మార్పిడి చేసిన ఘనత ఆయన సొంతం. జాతీయ..అంతర్జాతీయ స్థాయిలో 200లకు పైగా వైద్య పరిశోధన పత్రాల్ని ప్రచురించిన ఆయన.. ఎంజీఆర్.. కరుణానిధి.. రజనీకాంత్ తదితర ప్రముఖులకు వైద్య సేవలు అందించారు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించిన నేపథ్యంలో ఆయన్ను అభినందించేందుకు వచ్చిన కేసీఆర్.. పనిలో పనిగా సన్మానం చేసినట్లుగా చెబుతున్నారు.