మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లుగా ఉంది తెలంగాణ ప్రభుత్వ తాజా ఆర్థిక పరిస్థితి. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లోకి కూరుకుపోయిన తెలంగాణకు తాజాగా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం భారాన్ని మరింతగా పెంచిన పరిస్థితి. ఈ మధ్యన జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తొమ్మిది కేటగిరీల లబ్థిదారులకు ఇప్పటివరకూ అందజేస్తున్న పెన్షన్లను భారీగా పెంచుతూ కేసీఆర్ హామీ ఇవ్వటం తెలిసిందే.
వికలాంగులకు ఇప్పటివరకు ఇస్తున్న రూ.1500 పెన్షన్ స్థానే రూ.3016.. ఇతర కేటగిరీల లబ్థిదారులకు రూ.1000 నుంచి రూ.2016కు పెంచుతూ కేసీఆర్ అప్పట్లో హామీ ఇచ్చారు. పెన్షన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీకి మించినట్లుగా ఉండాలన్న రీతిలో.. వారు పేర్కొన్న మొత్తానికి రూ.16 చొప్పున అదనంగా యాడ్ చేసి హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన కేసీఆర్.. తానిచ్చిన హామీని అమలు చేస్తానని పేర్కొన్నారు.
వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం చూస్తే.. ఏప్రిల్ ఒకటి నుంచి హామీ ఇచ్చినట్లుగా పెంచిన పెన్షన్లను లబ్థిదారులకు అందించాల్సి ఉంటుంది. కానీ.. లాజిస్టిక్స్ ఇబ్బందులు.. సాంకేతి అంశాల కారణంగా రెండు నెలలు ఆలస్యంగా జూన్ 1 నుంచి కొత్త పెన్షన్ల విధానాన్ని అమలు చేయనున్నారు. తాజా పథకం జూన్ 1 నుంచి అమల్లోకి రావటం కారణంగా.. లబ్థిదారుల అకౌంట్లోకి జులై 1 నుంచి పెంచిన మొత్తం బ్యాంకు ఖాతాల్లోకి జమ కానుంది.
తాజా పెంపు కారణంగా వృద్ధులు.. వితంతువులు.. వికలాంగులు.. చేనేత కార్మికులు.. గీత కార్మికులు.. హెచ్ ఐవీ బాధితులు.. బీడీ కార్మికులు.. ఒంటరి మహిళలు.. పైలేరియా బాధితులంతా ఉన్నారు. ఇప్పటివరకూ పెన్షన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి రూ.5010 కోట్ల మొత్తాన్ని ఖర్చుచేస్తోంది. తాజాగా పెంచిన మొత్తంతో పెన్షన్ల బిల్లుభారీ కానుంది. ఈ ఏడాది నుంచి ఈ బిల్లు ఏడాదికి ఏకంగా రూ.10,020 కోట్లు కానున్నట్లు చెబుతున్నారు.