గాలి వాటంగా ఉన్నప్పుడు అన్ని పనులు చక్కదిద్దుకోవాలి. ఎప్పుడేం చేయాలన్న విషయంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కున్న క్లారిటీ మరే నేతకు లేదని చెప్పాలి. వాతావరణం తనకు అనుకూలంగా లేనప్పుడు చప్పుడు చేయనట్లుండే ఆయన.. ఇప్పుడు బాకీ ఉన్న ఎన్నికల్ని ఒకటి తర్వాత ఒకటిగా పూర్తి చేసే పని లో పడ్డారు. ఇటీవల వెలువడిన పుర ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ కున్న పట్టు ఎంతన్న విషయాన్ని తెలిసిన నేపథ్యంలో.. ఇదే ఊపులో మరో ఎన్నికకు ఆయన సిద్ధమవుతున్నారు.
గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని అధికారుల్ని ఆదేశించారు. పదవీ కాలం ముగుస్తున్న వేళ.. మరో మూడు.. నాలుగు రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించారు. 15 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ను పూర్తి చేయాలని.. కొత్త పాలక వర్గాల్ని నియమించాలన్న ఆలోచన లో ఆయన ఉన్నారు.
సహకార ఎన్నికలు తెలంగాణ లో రెండేళ్ల క్రితం అంటే..2018లోనే జరగాల్సి ఉన్నా.. వాయిదా పడుతున్నాయి. పాలక వర్గాల స్థానంలో పర్సన్ ఇన్ ఛార్జీలను నియమించిన కేసీఆర్.. ఇప్పుడున్న సానుకూల రాజకీయ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. రాష్ట్రం లో 584 మండలాలకు 906 సహకార సంఘాలు ఉండేవి. అయితే.. మండలాల సంఖ్య పెరిగిన నేపథ్యం లో ఈసారి మొత్తం 1340 సహకార సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక.. ఫలితమంటారా? దాని గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పండి?