టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన 20 ఏళ్లు అయిన సందర్భంగా ఈ రోజున హైదరాబాద్ లోని హైటెక్స్ లో పార్టీ ప్లీనరీని భారీగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గడిచిన కొద్ది రోజులుగా భారీ ఎత్తున చేపట్టిన కార్యక్రమాలు చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే.. ప్లీనరీ వేళ.. కీలక ఉపన్యాసం చేసిన సీఎం కేసీఆర్.. తన ప్రసంగంలో ఏపీ మీద పలు విమర్శలు.. ఆరోపణలతో పాటు.. తన అమ్ముల పొదిలో బలమైన మాటల అస్త్రాన్ని ఆయన సంధించారు. మనసు దోచుకునే మాటలతో తెలంగాణకు తమ పార్టీ చేసిన సేవ మరెవరూ చేయలేదన్న రీతిలో ఆయన మాటలు ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఎలా పాలన చేసుకోవాలో తెలీదని ఎటకారం ఆడారని.. విభజన జరిగితే తెలెగాణ చీకట్లలో కూరుకుపోతుందని శాపనార్థాలు పెట్టారని.. ఇప్పుడు ఏపీలోనే చీకట్లు ఉన్నాయని మండిపడ్డారు. కేసీఆర్ ప్రసంగంలోని కీలక వ్యాఖ్యల్ని చూస్తే..
- ఆంధ్రాలో పార్టీ పెట్టమని పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయి. దళితబంధు ప్రకటించిన తర్వాత ఆంధ్రా నుంచి వేలాది వినతులు వస్తున్నాయి. ఆంధ్రాలో పార్టీ పెట్టండి.. గెలిపించుకుంటామని చెబుతున్నారు. తెలంగాణ పథకాలు తమకు కావాలని ఆంధ్రా ప్రజలు కోరుతున్నారు. ఉత్తరాది నుంచి వేలాదిగా కూలీలు తెలంగాణకు వచ్చి పని చేస్తున్నారు.
- ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆశ్చర్యపోతున్నారు. సంక్షేమ పథకాలకు ఇంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తోందని అడుగుతున్నారు. సాహసం లేకుండా ఏ కార్యం సాధ్యం కాదు. కలలు కని.. ఆ కలల్ని శ్వాసిస్తేనే సాకారమవుతాయి.
- కలలు కనే సాహసం కూడా ఉండాలి.. స్వాప్నించాలి, సాకారం చేసుకోవాలి.. కొందరు అదెలా సాధ్యం అని ప్రశ్నిస్తున్నారు. ఏపీ పర్ క్యాపిట ఆదాయం లక్షా70వేల కోట్లు, తెలంగాణ పర్ క్యాపిట ఆదాయం 2లక్షల ముప్పై వేల కోట్లు. నేడు తెలంగాణలో 24 గంటల కరెంట్, ఏపీలో కరెంట్ కోతలు ఉన్నాయి. ఎక్కడి తెలంగాణ, ఎక్కడి ఏపీ.. అసలు ఇప్పుడు రెండు రాష్ట్రాలకు పొంతనే లేదు.
- సమైక్య పాలకులు వేయని నిందలు.. పెట్టని తిప్పలు లేవు. ఎన్ని చేయాలో అన్నీ చేశారు. చివరకు రాజ్యసభలో బిల్లు పాసయ్యే ముందు వరకు కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు. మనం కూడా కూడా అంతే పట్టుదలతో ముందుకు సాగాం. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అహింసాయుత మార్గంలో పోరాటం చేసి విజయం సాధించొచ్చన్న విషయాన్ని నిరూపించాం. ప్రపంచ ఉద్యమాలకే కొత్త భాష్యాన్ని.. బాటను నిర్దేశించాం.
తెలంగాణ వస్తే ఆరాచకం వస్తుందని.. పాలన చేతకాదని.. భూముల ధరలన్నీ పడిపోతాయనిప్రచారం చేశారు. ఏడేళ్ల పాలనతో ఆ అపోహలన్నీ పటాపంచలు చేశారు. ఎఫ్ సీఐ సైతం కొనలేమని చెప్పే స్థాయిలో వరిని పండించాం. గతంలో ఉపాధి కోసంపాలమూరు నుంచి ముంబయి వలస వెళ్లేవారు. ఇప్పుడు పాలమూరుకు వస్తున్నారు.
- సచివాలయం, యాదాద్రి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కడతామంటే కేసులు వేశారని... అన్నింటినీ ఛేదించి గొప్ప తెలంగాణను ఆవిష్కరించుకున్నాం. భారతదేశాన్ని తట్టిలేపే దళిత బంధు ఉద్యమాన్ని మొదలు పెట్టాం. తెలంగాణ వారికి పాలన చేతకాదని అవమానించారని, అనేక రకాలుగా దుష్ప్రచారం చేశారు. నేడు అనేక రంగాల్లో తెలంగాణ దేశంలో అగ్రగామిగా ఉంది.
- పంజాబ్‌ను తలదన్ని వరి ఉత్పత్తిలో అగ్రభాగాన నిలిచింది. విద్యుత్ సగటు వినియోగంలో నంబర్ వన్‌లో ఉంది. తెలంగాణ పథకాలు దేశ వ్యాప్తంగా కాపీ కొట్టబడుతున్నాయి. రాయచూరు ఎమ్మెల్యే, నాందేడ్ జిల్లా ప్రజలు తెలంగాణ పథకాలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. ఇంత గొప్ప అభివృద్ధిని తెలంగాణ సాధించింది.