కేసీఆర్ ను ఇలా ఎప్పుడైనా చూశారా?

Update: 2017-02-18 08:36 GMT
ఎంతవారలైనా.. అని చాలా విషయాలకు అన్వయించుకోవచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనగానే ఒక ఉద్యమ నేతగా.. గొప్ప ప్రసంగీకుడిగా.. ముఖ్యమంత్రిగానే కనిపిస్తాడు. కానీ ఆయనలోని మరో కోణం గురించి బయటికి తెలిసింది తక్కువ. కేసీఆర్ కుటుంబానికి చాలా ప్రాధాన్యమిస్తాడు. ఇంటి లోపలికి అడుగుపెట్టాడంటే ఆయన సామాన్యుడిగా మారిపోతాడు. తన మనవడి దగ్గర ఆయన కూడా చిన్న పిల్లాడైపోతాడు. ఆ మధ్య కేసీఆర్ ఇంటిలోపలి దృశ్యాలతో ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ వీడియో తీసింది కేసీఆర్ మనవడే. అందులో కేసీఆర్ ఇంటి లోపలికి వచ్చి మనవడితో సరదాగా వ్యవహరించడం చూసే ఉంటాం.

తాజాగా తన ముద్దుల మనవడిని కేసీఆర్ ముద్దు చేస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఫొటో ఎప్పుడు ఎక్కడ తీశారో కానీ.. మనవడు హిమాన్షు (కేటీఆర్ కొడుకు)ను చాలా ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని ముద్దాడుతున్నాడు కేసీఆర్. ఈ అరుదైన ఫొటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కేసీఆర్ ఇలా కనిపించడం అరుదు. గత ఏడాది ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర అదిరిపోయే స్పీచ్ తో వెలుగులోకి వచ్చాడు హిమాన్షు. ఆ స్పీచ్ చూశాక హిమాన్షు కూడా తండ్రి.. తాతల్లాగే మంచి స్పీకర్ అవుతాడనిపించింది అందరికీ. ఇటీవలే ఇండియా-బంగ్లాదేశ్ టెస్టు మ్యాచ్ చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి వచ్చిన హిమాన్షు.. అక్కడ తన స్నేహితులతో కలిసి సందడి చేశాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News