పోలీస్ ట్విన్ టవర్స్ లో అసలేం ఉంటుంది?

Update: 2015-11-23 03:50 GMT
దాదాపు కోటికి పైనే జనాభాతో ఉన్న హైదరాబాద్ మహా నగరంలో మణిపూసలాంటి భవనానికి శంకుస్థాపన జరిగింది. ట్విన్ సిటీస్ భద్రతకు భరోసా ఇస్తూ.. ట్విన్ టవర్స్ లో ఏర్పాటు కానుంది. ఇందుకోసం దాదాపు రూ.వెయ్యి కోట్లను ఖర్చు చేయనున్నారు. ఈ ఏడాదికి రూ.300కోట్లు.. వచ్చే బడ్జెట్ లో రూ.700 కోట్లను కేటాయించనున్న ఈ పోలీస్ ట్విన్ టవర్స్ కానీ పూర్తి అయితే.. పోలీసింగ్ వ్యవహారం మొత్తం పూర్తిగా మారిపోతుందన్న మాట వినిపిస్తోంది. అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని రూపొందిస్తున్న ఈ పోలీస్ ట్విన్స్ టవర్స్ లో విశేషాలకు కొదవ లేదని చెబుతున్నారు.

ఈ పోలీస్ ట్విన్ టవర్స్ లో కాప్ లెస్ పోలీసింగ్ ఒక ప్రత్యేకతగా చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల్ని అనుసంధానం చేయటంతో పాటు.. ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్.. కంట్రోల్ సెంటర్ ను నిర్మించనున్నారు. న్యూయార్క్.. సింగపూర్ నగరాల్లో మాదిరి అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతికత సాయంతో ఈ ఆధునిక పోలీసింగ్ ఉంటుంది. ఇక.. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని 12 ఎకరాల స్థలంలో నిర్మించే ఈ ట్విన్స్ టవర్స్ లో అసలేం ఉంటాయన్న విషయానికి వస్తే..

= హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్.. ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు.

= 5.5 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు బ్లాకులుగా 24 అంతస్తులలో ట్విన్ టవర్స్ ను నిర్మిస్తారు.

= బిల్డింగ్ పై భాగంగా హెలిఫ్యాడ్ నిర్మిస్తారు.

= 17వ ఫ్లోర్ లో పబ్లిక్ అబ్జర్వేషన్ డెక్ ఏర్పాటు

= 18వ అంతస్తులో పోలీస్ కమిషనర్ కార్యాలయం

= పోలీస్ మ్యూజియం

= సభలు.. సమావేశాలకు అనువుగా ఆడిటోరియం. దాదాపు 900 మంది కూర్చునే వీలున్న నిర్మాణం

= 740 వాహనాలు పార్కింగ్ చేసుకునే వెసులుబాటు

= పచ్చదనంతో కూడిన పరిసరాలు

= సోలార్ ఫెన్సింగ్. సోలార్ తోనే భవన విద్యుత్తు అవసరాలు తీర్చుకునే ఏర్పాటు

= 100కి కానీ.. షీటీమ్స్ కానీ ఫోన్ చేస్తే.. ఘటనాస్థలానికి పోలీసులు ఐదు నిమిషాల వ్యవధిలో వెళ్లే ప్రత్యేక ఏర్పాటు

= ఈ భవనానికి అవసరమైన ఫైబర్ కేబుల్ ను రిలయన్స్ సంస్థ 5 ఏళ్ల పాటు భరించేలా ఒప్పందం
Tags:    

Similar News