తెలంగాణ ఉద్యమంలో భుజంభుజం రాసుకుంటూ జనాన్ని నడిపించిన కేసీఆర్ - కోదండరాంల మధ్య యుద్దాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ జెఎసి - టిఆర్ ఎస్ పార్టీల మధ్య వివాదం ముదురడం... ఒకప్పుడు గురుస్థానంలో ఆరాధించిన కోదండరాంపై కేసీఆర్ టీం ఇప్పుడు నానా విమర్శలు చేస్తుండడంతో తెలంగాణలో రాజకీయ వేడి ముదిరింది. మరోవైపు టీజేఏసీ కీలక సమావేశం బుధవారం మొదలైంది... అక్కడ భవిష్యత్తు కార్యాచరణపై కోదండరాం నిర్ణయం వెలువరిస్తారని భావిస్తున్నారు. టిజెఎసిని రాజకీయ పార్టీగా మారుస్తారనే ప్రచారం చాలాకాలంగా ఉండడంతో తాజా భేటీపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆయన కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే.. కెసిఆర్ - కోదండరాంల మధ్య విభేదాలు ఇప్పుడు బయటపడ్డా గత మూడేళ్ల నుంచి ప్రచ్ఛన్నంగా కొనసాగుతున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ట్యాంక్ బండ్ పై మిలియన్ మార్చ్ నిర్వహించిన సమయంలోనే కోదండరాంపై టిఆర్ ఎస్ వ్యతిరేకత వ్యక్తం చేసిందని.. అప్పటి నుంచి విభేదాలు తీవ్రమయ్యాయని చెబుతున్నారు. మూడేళ్ల కిందట మొదలైన గొడవలు ఇప్పుడు ముదిరి పాకాన పడ్డాయని చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం - టీఆరెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో కేసీఆర్ పాలన బాగుందని అభినందించిన కోదండరాం ఆ తరువాత తన దారి మార్చుకున్నారని.. ఆయనపై ఇతర శక్తులపై ప్రభావం ఉందని టీఆరెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అమెరికా వెళ్లి వచ్చిన తరువాత ఆయనలో మార్పు వచ్చిందని, అక్కడ ఏం జరిగిందని టిఆర్ ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. టిఆర్ ఎస్ - టిజెఎసిల మధ్య కోల్డ్ వార్ - తెర వెనుక రాజకీయాలు సాగుతున్నా బహిరంగంగా విమర్శలు చేసుకోవడం - ఈ స్థాయిలో గొడవలు బయటపడడం ఇదే తొలిసారి. 2009లో కేంద్రం తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసి తెరవెనక్కి వెళ్లినప్పుడు టిఆర్ ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ అన్నిపార్టీల కలుపుకొని ఉద్యమించడానికి తెలంగాణ జెఎసి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. టిజెఎసి ఏర్పాటులో టిఆర్ ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ ప్రధాన భూమిక పోషించగా కాంగ్రెస్ - బిజెపి - సిపిఐ - టిడిపి - న్యూ డెమోక్రసీ పార్టీలకు చెందిన తెలంగాణ నాయకులు టిజెఎసిలో పాల్గొన్నారు. కోదండరామ్ నాయకత్వానికి అప్పుడు టిడిపి సైతం మద్దతు ఇచ్చింది. అధికారంలో ఉండడం వల్ల టిజెఎసి నుంచి తొలుత కాంగ్రెస్ బయటకు వచ్చింది. టిడిపిని జెఎసి బహిష్కరించింది. తెలంగాణ ఏర్పాటు ఉద్యమం టిజెఎసి నాయకత్వంలో సాగినా తెలంగాణ ఆవిర్భావం తరువాత టిజెఎసి క్రమంగా నీరుగారింది.
మరోవైపు సాధారణ ఎన్నికల నాటి పరిణామాలు కూడా టీఆరెస్ ను జేఏసీకి దూరం చేశాయి. ఎన్నికల్లో టిఆర్ ఎస్ కు ఓటు వేయాలని జెఎసి తరఫున పిలుపు ఇవ్వాలని కెసిఆర్ కోరగా అందుకు జెఎసి అంగీకరించలేదు. ఇది రెండింటి మధ్య తీవ్ర విభేదాలకు దారి తీసిందని చెబుతున్నారు. అయితే... రాజకీయ పార్టీలు - ఉద్యోగ సంఘాలు జేఏసీకి దూరమైనా కూడా తాజాగా పాలక టీఆరెస్ తో జేఏసీ ఢీ అంటే ఢీ అంటుండడంతో ప్రజా సంఘాలు మళ్లీ జేఏసీ వైపు చూస్తున్నాయి. మొత్తానికి కోదండరాంపై కేసీఆర్ కోపం ఈనాటిది కాదని.. మూడేళ్ల కిందటే మొదలైందని గత ఘటనలు చెబుతున్నాయి.