మోదీని ఢీకొట్టడానికి రెడీ అవుతున్న కేసీఆర్ తాను ఏర్పాటు చేసిన బీఆర్ఎస్‌తో వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రాగలనా లేదా అనే విషయంలో ఎంత స్పష్టంగా ఉన్నారో తెలియదు కానీ మోదీని ఢీకొట్టాలంటే ఏం చేయాలనే విషయంలో మాత్రం స్పష్టతకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన త్రిముఖ వ్యూహం రచించారని బీఆర్ఎస్ వర్గాలు హింట్స్ ఇస్తున్నాయి.
లోక్ సభ ఎన్నికలకు ముందే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి కాబట్టి పార్టీని అధికారంలోకి తేవడానికి, శ్రేణులకు ఊపు ఇవ్వడానికి, తెలంగాణను వదిలే ఆలోచన లేదని ప్రజలకు సంకేతం ఇవ్వడానికి యథావిధిగా అసెంబ్లీకి కేసీఆర్ పోటీ చేస్తారు.
ఆ తరువాత లోక్ సభ ఎన్నికల నాటికి కేసీఆర్ అసలు ప్లాన్ బయటకు తీస్తారు. అది లోక్‌సభకు కేసీఆర్ పోటీ చేయడం. అది కూడా ఒక చోట నుంచి కాదు రెండు చోట్ల నుంచి పోటీచేయడం.
అయితే, తెలంగాణలోని రెండు నియోజకవర్గాల నుంచి ఆయన పోటీ చేయరు. తెలంగాణలోని ఒక నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్‌లోని మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి కేసీఆర్ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది.
ఇందుకోసం ఇప్పటి నుంచే కేసీఆర్ కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాలలోని రెండు లోక్ సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి బీఆర్ఎస్‌కు ఊపు తేవాలన్నది కేసీఆర్ తొలి లక్ష్యం కాగా రెండో లక్ష్యం లోక్ సభ వేదికగా తన వాయిస్ వినిపించడం.
బీఆర్ఎస్ పేరిట భారీ ఖర్చుతో సభలు పెట్టడం ఎన్నికల వరకు మాత్రమే చేయగలరు.. ఎన్నికల తరువాత నిత్యం భారీ సభలు నిర్వహించడం ఖర్చుతో కూడిన వ్యవహారం. అదే లోక్ సభకు ఎన్నికైతే సమావేశాలు ఉన్న ప్రతిసారీ తనదైన వాక్చాతుర్యంతో దేశం దృష్టిని ఆకర్షించొచ్చన్నది కేసీఆర్ ఆలోచన. అటు మోదీ, ఇటు కాంగ్రెస్ పార్టీలు రెండింటినీ టార్గెట్ చేయడానికి, దిల్లీ కేంద్రంగా ఇతర రాజకీయ పార్టీల నేతలతో సంబంధాలు నెరపడానికి బాగుంటుందన్నది కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది.
లోక్‌సభలో టీఆర్ఎస్‌కు ఎంపీలు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నప్పటికీ వారెంత మాట్లాడినా కేసీఆర్ మాట్లాడినప్పుడు వచ్చే మైలేజ్ రాదు. టీఆర్ఎస్ ఎంపీలలో రంజిత్ రెడ్డి వంటి ఒకరిద్దరు తరచూ నేషనల్ మీడియాలో కనిపిస్తున్నప్పటికీ అనుకున్న మైలేజ్ లేదు. దీంతో కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగాలనుకుంటున్నట్లు సమాచారం.
ఇక కేసీఆర్ లోక్‌సభకు వెళ్తే తెలంగాణ పరిస్థితి ఏమనేది అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ విజయంపై ఆధారపడి ఉంటుంది. మూడోసారీ రాష్ట్రంలో కనుక అధికారంలోకి వచ్చినట్లయితే కేసీఆర్ తొలుత సీఎం పదవి చేపట్టినా లోక్‌సభ ఎన్నికలలో గెలిచిన తరువాత సీఎం కుర్చీ కేటీఆర్‌కు అప్పగించి తాను దిల్లీ వెళ్తారన్నది ఆ పార్టీ ఆంతరంగికుల మాట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.