టీఆరెస్ అధినేత - తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేషన్ వేయడానికి తగిన ముహూర్తం చూసుకున్నారు. జాతకాలు - ముహూర్తాలు - వాస్తు వంటివి పాటించడంతో ముందుండే కేసీఆర్ తన ఆస్థాన పండితులతో జ్యోతిశ్శాస్త్రాన్ని మదింపజేసి మరీ ముహూర్తాన్ని నిర్ణయించారట. దాని ప్రకారం... నవంబరు 15వ తేదీన ఆయన నామినేషన్ వేస్తారని తెలుస్తోంది. నవంబరు 12 నుంచి నామినేషన్ల పర్వం మొదలుకానుండగా నవంబరు 15 గురువారం - సప్తమి నాడు కేసీఆర్ తన నామినేషన్ సమర్పిస్తారని టీఆరెస్ వర్గాల నుంచి వినిపిస్తోంది. సీఎం కేసీఆర్ అదృష్ట సంఖ్య 6 కావడం.. 15వ తేదీని సింగిల్ నంబర్ కౌంట్ చేస్తే 6 రావడం.. తిథి - నక్షత్రాలు బాగుండడంతో అదే రోజు నామినేషన్ వేయవచ్చునని చెబుతున్నారు. అయితే... టీఆరెస్ - ఇతర పార్టీలకు చెందిన చాలామంది నేతలు మాత్రం వేరే తేదీలను ఎంచుకుంటున్నారు. ఎక్కువ మంది 14 - 19వ తేదీలు ప్రిఫర్ చేస్తున్నారు. 15వ తేదీన నామినేషన్ వేయాలనుకుంటున్నవారు తక్కువ మంది ఉన్నారు. దీంతో కేసీఆర్ ఇష్టపడిన తేదీని మిగతావారు ఎందుకు వద్దనుకుంటున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది.
మరోవైపు మిగతా అభ్యర్థులూ మంచి రోజులు చూసుకుని నామినేషన్లకు రెడీ అవుతున్నారు. పురోహితులను సంప్రదిస్తూ జాతకాలు చూపించుకుంటున్నారు. రానున్న ఎన్నికల సందడంతా ఇప్పుడే కనిపిస్తోంది. దీపావళి అమావాస్య గడిచిన వెంటనే రంగంలోకి దూకాలని వీరంతా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పనిలో పనిగా నామినేషన్లు దాఖలు చేసే కార్యక్రమానికి రావాలంటూ అగ్రనేతలను కోరుతున్నారు. ఇప్పటికే అత్యధిక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అధికార పార్టీ తెరాస - తమ అభ్యర్థులకు ఇంకా బి-ఫామ్ లు ఇవ్వలేదు. మహాకూటమి నేతలు ఏఏ స్థానాల నుంచి ఎవరెవరు పోటీ చేస్తారో స్పష్టం కాలేదు. అయినా టికెట్ ఫైనల్ అయిన అభ్యర్ధులు - టికెట్ తమకే ఖాయమనుకున్న నేతలు నామినేషన్ లు వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. తమ జాతకాల పట్టుకుని పండితులను సంప్రదిస్తున్నారు. బలమైన ముహూర్తాన్ని ఫిక్స్ చేయమని కోరుతున్నారు.
కాగా నవంబరు 12న నామినేషన్లకు నోటిఫికేషన్ విడుదల కానుండగా - ఎక్కువ మంది నేతలు 14వ తేదీ సప్తమి లేదా 19న ఏకాదశిన నామినేషన్ వేసేందుకు ముహూర్తాలను ఫిక్స్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కొందరు సంఖ్యాశాస్త్రం ప్రకారం 18వ తేదీని కూడా ఎంచుకుంటుండగా - ఎక్కువగా 14 - 19తేదీలలోనే రికార్డుస్థాయి నామినేషన్లు దాఖలయ్యే సూచనలున్నాయి. ఈనెల 12వ తేదీన నామినేషన్లు ప్రారంభం కానున్న రోజు కార్తీకమాస శుక్లపక్షం పంచమి కాగా - ఆ రోజు కూడా కొందరు నామినేషన్లు వేయాలని భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్ధులు కొందరు 12వ తేదీని ముహర్తంగా ఎంచుకున్నట్లు సమాచారం.