ఎమ్మెల్సీగా తుమ్మలకు ఆఫర్ ఇచ్చిన కేసీఆర్

Update: 2023-03-07 13:51 GMT
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో మూడు శాసనమండలి స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు సీఎం చంద్రశేఖర్ రావు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా చల్లా వెంకట్రామిరెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, కురుమయ్య గారి నవీన్ లను ఎంపిక చేశారు. మార్చి 29న అలిమినేటి కృష్ణారెడ్డి, వూల్లోళ్ల గంగాధర్ గౌడ్, కురుమయ్య గారి నవీన్ కుమార్ లు పదవీ విరమణ చేయడంతో వారి స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

తుమ్మల పార్టీలోనే..

తుమ్మల నాగేశ్వర్ రావు టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. 2015లో తెలంగాణ మంత్రివర్గంలో చేరారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నామినేషన్ వేశారు. తరువాత 2016లో పాలేరు ఉప ఎన్నికలో పోటీకి దిగి విజయం సాధించారు. కానీ 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉండటంతో పార్టీ వీడతారనే వాదనలు కూడా వచ్చాయి. తుమ్మలను పార్టీ నుంచి బయటకు వెళ్లనీయకుండా ఉండేందుకు ఆయనకు ఎమ్మెల్సీ స్థానం ఓకే చేసినట్లు సమాచారం.

హరీష్ రావు మధ్యవర్తిత్వం?

తుమ్మల నాగేశ్వర్ రావు పార్టీని వీడకుండా ఉండాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మధ్యవర్తిత్వం నడిపారు. నాగేశ్వర్ రావు పార్టీని వీడితే కలిగే నష్టాల గురించి వివరించారు. దీంతో ఆయనను పార్టీలో ఉండాలని కోరారు. తగిన ప్రాతినిధ్యం కల్పిస్తామనే భరోసా కల్పించారు. ఇందులో భాగంగానే తుమ్మలకు ఎమ్మెల్సీ గా అవకాశం ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తుమ్మల నాగేశ్వర్ రావు పార్టీ నుంచి బయటకు వెళ్లకుండా చేయడంలో హరీష్ రావు చొరవ తీసుకోవడంతో తుమ్మలకు ఎమ్మెల్సీ పదవి వరించనుందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

13న నామినేషన్

ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం ఎమ్మెల్సీ నామినేషన్లకు చివరి తేదీ మార్చి 13, మరుసటి రోజు నామినేషన్ల పరిశీలన, మార్చి 16న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ, పోలింగ్ మార్చి 23న నిర్వహిస్తారు.

ఇలా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఉండటంతో అభ్యర్థులు తమ నామినేషన్ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఉండటంతో అధికార పార్టీ బీఆర్ఎస్ కే ఇవి దక్కడం ఖాయం. అందుకే కేసీఆర్ మూడు పేర్లు ఫైనల్ చేశారు. ఇక ఎన్నికలు నిర్వహించడమే మిగిలింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News