మా గెలుపును చూసి తెలంగాణ వాళ్లే కాదు తెలుగు ప్రజలందరూ సంతోషపడ్డారు. ఆంధ్ర నుంచి లక్షల సందేశాలు, అభినందనలు డిమాండ్లు వచ్చాయి. అక్కడికి రమ్మంటున్నారు. దేశ రాజకీయాల్లో మేము భాగస్వాములం అవుతాం అన్నాం. అవుతాం. అందులో భాగంగా ఆంధ్రకు వెళ్తాం. తెలుగు ప్రజల బాధ్యత మాపై ఉందని చంద్రబాబు చెప్పారు. మాకు లేదా బాధ్యత అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలుగు ప్రజలు బాగుండాలని - దేశ ప్రజలే బాగుండాలని ఉంది. చంద్రబాబు మాకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చాడు. మేము కూడా బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. కచ్చితంగా ఇస్తాం. తెలుగు ప్రజలందరూ మాకు అక్కరే. అందరి బాగోగులు చూస్తాం అని కేసీఆర్ అన్నారు.
ఎన్నికల ఫలితాల అనంతరం టీఆర్ ఎస్ భవన్ లో నాలుగ్గంటలకు ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్ ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన అనేక విషయాలపై స్పందించారు. మాకు భారీ గెలుపును ఇచ్చారు. అంతకుమించి బాధ్యతను ఇచ్చారు. సిల్లీ రాజకీయాలకు కాలం చెల్లిందని చెప్పారు. ఈ మాటలకు ముందు కూడా కేసీఆర్ చంద్రబాబును పరోక్షంగా విమర్శించారు. అలయన్స్ ల కాలం పోయింది. రాజకీయ పార్టీల కూటమి కాదు కావాల్సింది. నాది ఆ పద్ధతి కాదు. ప్రజల అలయన్స్ కావాలి. ప్రజలను ఏకం చేయాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. లోకేష్ ఇటీవలే ఆంధ్రకు రండి అని కేటీఆర్ ను కేసీఆర్ ను స్వాగతించారు. మరి ఈ ప్రెస్ మీట్ తర్వాత ఏం స్పందిస్తారో చూడాలి.