ఇటీవల తన మూడు రోజుల ఢిల్లీ పర్యటన సందర్భంగా పలు అంశాల్నితెర మీదకు తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపును ప్రస్తావించారు. కేంద్రమంత్రుల వద్ద ఈ విషయాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అనంతరం.. వాటి మీద ఆయనకు ఎలాంటి భరోసా లభించిందన్న విషయాన్ని కేసీఆర్ వెల్లడించింది లేదు. తాజాగా చేపట్టిన ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు అంశాన్ని ప్రస్తావించారు.
ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు.. త్వరలో 153 అయ్యే అవకాశం ఉందన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.ఈ విషయాన్ని ఆయన తెర మీదకు తేవటానికి కారణం లేకపోలేదు. ఖమ్మం జిల్లాను పునర్విభజన చేయాలన్న ఆలోచన ఉంది. అయితే.. మొదట పునర్విభజన చేయాలా? లేక.. అసెంబ్లీస్థానాల పెంపు తర్వాత పునర్విభజన చేయాలా? అన్న విషయంపై తాము ఆలోచిస్తున్నామని చెప్పే క్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
ఖమ్మం జిల్లాను రెండుగా చేయాలన్న ఆలోచన విషయంపై తాజాగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కాస్త ఆసక్తికరంగా మారాయి. ఎందుకంటే.. ఈ జిల్లాను రెండుగా చేయటానికి నియోజకవర్గాల పెంపు లింకును ఆయన పెట్టటంతో.. ఇప్పటికిప్పుడు ఈ డిమాండ్ పరిష్కారం అయ్యే అవకాశం లేనట్లే. ఒకవేళ అసెంబ్లీ నియోజవర్గాల పెంపు తర్వాతే జిల్లాను రెండుగా చేస్తామంటే.. ఇక.. ఆ విషయం కొంతకాలం వెనక్కి వెళ్లటం ఖాయం. ఈ విషయాన్ని నేరుగా ప్రస్తావిస్తే రచ్చ జరిగే అవకాశం ఉండటంతో.. దాన్నినియోజకవర్గాల పెంపుతో లింకు పెడుతూ కేసీఆర్ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. అందుకే.. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై కేంద్రం తనకు పక్కా హామీ లభించకున్నా.. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు తర్వాత జిల్లా విభజన ఉంటుందన్న మాటను చెప్పటం ద్వారా.. కొత్త జిల్లాల ఏర్పాటు సమీప భవిష్యత్తులో లేదన్న విషయాన్న కేసీఆర్ చెప్పకనే చెప్పేసినట్లైంది. ఖమ్మంకు ఏ రూల్ అప్లై అవుతుందో.. తెలంగాణలోని కొత్త జిల్లాల హామీకి అదే వాదన వర్తిస్తుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో..?