కొన్నిసార్లు అంతే. ఒక్కసారిగా అంతా తెలిసిపోతుంది. అప్పటివరకూ ఉన్న పంతాలు..పట్టింపులు.. ఆవేశకావేశాలు అన్నీ తగ్గిపోతాయి. ఎందకింత లొల్లి.. కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయే దానికి అంటూ కొత్త రాగాలు తీస్తుంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే రీతిలో ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం.. ఆయన తీరు కాస్త భిన్నంగా ఉండేది. ఏదైనా వివాదం వస్తే.. అయితే.. కేంద్రం దగ్గరకు లేదంటే కోర్టును ఆశ్రయించేందుకు ఏ మాత్రం వెనుకాడేవారుకాదు.
కూర్చొని మాట్లాడుకోవచ్చుకదా అంటే.. మన వాదనను మనం వినిపిద్దాం.. కోట్లాడదామన్నట్లుగా ఆయన చెప్పేవారు. గడిచిన రెండున్నరేళ్ల వ్యవధిలో ఎన్నో వివాదాల్లో ఆయనకు ఎదురైన పాఠాలు కావొచ్చు.. అనుభవాలు కావొచ్చు.. ఆయన మాట మారేలా చేయటమే కాదు.. సరికొత్తగా మాట్లాడుతున్నారు. తాజాగా కృష్ణా జలాల పంపకాలపై కేంద్రం ఏర్పాటుచేసిన బజాజ్ కమిటీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసింది. రాష్ట్రాల మధ్య నెలకొన్న విభేదాల గురించి చర్చ వచ్చింది. ఈ సందర్భంగా కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాటలు వింటే కొత్తగా ఉండటమేకాదు.. ఇవన్నీ కేసీఆర్ నోటి నుంచే వచ్చాయా? అన్న భావన కలగటం ఖాయం.
ఎందుకంటే.. జల వివాదాలు వాంఛనీయం కాదని.. ఇరురాష్ట్రాలుకలిసి కూర్చోవటం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని.. తెలంగాణ రాష్ట్ర వాటా ప్రకారమే నీటిని వాడుకుంటామని చెప్పటమేకాదు.. ఉమ్మడి ప్రాజెక్టుల్లోని నీటి వినియోగానికి సంబంధించి నియమాలను రూపొందించాలన్నారు.ఓపక్క ముఖ్యమంత్రి నోటి నుంచి ఈ తరహా వాదన వినిపించినా.. తెలంగాణ.. ఏపీ అధికారుల మధ్య సాగిన చర్చలు మాత్రం అందుకు భిన్నంగా సాగటం విశేషం.
తెలంగాణలోని జురాలను ఉమ్మడి ప్రాజెక్టు కిందకు తీసుకురావాలని ఏపీ అధికారులు కోరగా తెంగాణఅధికారులు నో అనేశారు. అదే సమయంలో ఏపీలోని పులిచింతల.. సుంకేశుల ప్రాజెక్టుల్ని ఉమడి ప్రాజెక్టుల పరిధిలోకి తీసుకురావాలని కోరగా.. అందుకు ఏపీ అధికారులు ఒప్పుకోలేదు. చూస్తుంటే.. కేసీఆర్ కు బోధ పడిన తత్త్వం రెండు తెలుగు రాష్ట్రాల అధికారులకు బోధపడినట్లుగా కనిపించట్లేదని చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/