కొత్త జిల్లాల ఏర్పాటును షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. అయితే ఈ వ్యవహారమంతా అందరి అభిప్రాయం మేరకు కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ మనసుకు తగ్గట్లే జరుగుతున్నట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు మొదలు..రెవెన్యూ డివిజన్లు.. మండలాలు మొత్తం ముఖ్యమంత్రి అనుకున్నట్లే జరగటం గమనార్హం. తొలుత 14 జిల్లాలుగా ఫిక్స్ చేయటం.. ఆ తర్వాత ముఖ్యమంత్రి భేటీ నిర్వహించి కొత్త జిల్లాల సంఖ్యను 17కు పెంచటం మొదలు రెవెన్యూ డివిజన్లు.. మండలాలకు సంబంధించి మొత్తం కేసీఆర్ అనుకున్నట్లే జరగటంపై రాజకీయ వర్గాలు గుర్రుగా ఉన్నాయి.
కొత్త జిల్లాల ఏర్పాటుకు నియమించిన అధికారుల కమిటీ.. తర్వాత ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సుల్ని సైతం కాదని ముఖ్యమంత్రి కొత్త జిల్లాల సంఖ్యను ఏకాఏకిన పెంచేయటం ఒక ఎత్తు అయితే.. రెవెన్యూ డివిజన్లు.. మండలాలకు సంబంధించిన వినతుల్ని ఏ మాత్రం పరిగణలోకి తీసుకొలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ తాను అనుకున్నదే ఫైనల్ అన్నట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లే పలు ఉదాహరణల్ని ప్రస్తావిస్తున్నారు. కొత్త జిల్లాలకు సంబంధించి కొన్ని అంశాలకు వస్తే.. కేసీఆర్ చెబుతున్న మాటల్ని కూడా ఆయన ఫాలో కాలేదన్న మాట వినిపిస్తోంది.
ప్రస్తుతం 44 రెవెన్యూ డివిజన్లు ఉండగా.. కొత్తగా 11 జిల్లాల్నిమాత్రమే లిస్ట్ లో ఉంచారు. వాస్తవానికి 19 కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రకటించారు. కానీ.. వాటిని 11 రెవెన్యూ డివిజన్లకే పరిమితం చేయటం గమనార్హం. ఎందుకిలా అన్న దానికి ఎవరూ సమాధానం చెప్పని పరిస్థితి. ఇక.. మార్పులు చేసిన డివిజన్ల విషయంలోనూ నిర్ణయం ఏకపక్షంగా ఉందన్న మాట వినిపిస్తోంది. ఇందుకుకొన్ని ఉదాహరణల్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. సరూర్ నగర్ రెవెన్యూ డివిజన్ ను తొగించి దాన్ని ఇబ్రహీంపట్నం పేరుతో మార్పు చేయటం.. ఖమ్మంలోని పాల్వంచ డివిజన్ ను తొలగించి వైరా డివిజన్ ను తెర మీదకు తీసుకొచ్చారు. హన్మకొండ లో కొత్త హుజురాబాద్ డివిజన్ ను ప్రతిపాదించారు. నిర్మల్ లో ముధోల్.. కొమరంభీం జిల్లాలో బెల్లంపల్లి డివిజన్ జాబితాలోకి చేరింది. ఇలా రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు మొత్తం ముఖ్యమంత్రి కనుసన్నల్లో జరిగిందన్న మాట వినిపిస్తోంది.
రెవెన్యూ డివిజన్ల విషయంలోనే కాదు మండలాల విషయంలోనూ ముఖ్యమంత్రి తాను అనుకున్నదే చేశారంటున్నారు. మండలాల పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి చేసిన వినతుల్ని మంత్రివర్గ ఉపసంఘం సున్నితంగా తిరస్కరించినట్లు చెబుతున్నా.. ఇదంతా ముఖ్యమంత్రి పుణ్యమేనని విమర్శించే వారు లేకపోలేదు. కరీంనగర్ లోని ఇల్లంతకుంట.. ముస్తాబాద్.. హుస్నాబాద్.. కోహెడలను సిద్ధిపేటలో కలపొద్దంటూ ఆ జిల్లా ప్రజాప్రతినిధులు కోరారు. కానీ.. అవన్నీ ప్రతిపాదిన సిద్దిపేట జిల్లాలోకే చేరాయి.
జనగామ నియోజకవర్గానికి చెందిన చేర్యాల.. మద్దూరు మండలాలు సిద్దిపేటలో కలిసేది లేదని స్థానిక ఎమ్మెల్యే ప్రకటించారు. కానీ.. అందుకు భిన్నంగా ఆ మండలాలు సిద్దిపేటలోకే చేరటం గమనార్హం. జనగామ నియోజకవర్గంలోని మండలాలు మూడు ముక్కలయ్యాయి. బచ్చన్నపేట.. జనగామ ప్రతిపాదిత యాదాద్రిలోకి వెళ్లగా.. మద్దూరు.. చేర్చాల.. సిద్దిపేటలోకి వెళ్లాయి. ఇక.. నర్మెట్ట హన్మకొండ జిల్లాలోకి వెళ్లిపోయాయి.
ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు నియోజకవర్గంలోని ఇల్లెందు.. టేకులపల్లి మండలాలు కొత్తగూడెం జిల్లాలోకి వెళ్లగా.. బయ్యారం.. గార్ల మహబూబాబాద్ జిల్లాలోకి చేరాయి. మెదక్ జిల్లాలోని పటాన చెరు.. రామచంద్రాపురం ప్రాంతాల్ని సికింద్రాబాద్ జిల్లాలో కలపకూడదని పలువురు నేతలు కోరితే.. జాబితాలోని సికింద్రాబాద్ జిల్లానే గల్లంతు కావటం గమనార్హం. ఈ రెండు మండలాల్ని సంగారెడ్డిలో కలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు.. రెవెన్యూ డివిజన్లు.. మండలాలు మొత్తం ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే జరిగాయని.. ఆయన అనుకున్నది అనుకున్నట్లే చేశారే తప్పించి ఎవరి మాటను వినలేదన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. తాను అనుకున్నది అనుకున్నట్లుగానే ముఖ్యమంత్రి చేశారన్న మాట రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.