కరోనా వేళ..ముక్కులో ఆ వేళ్లు పెట్టుకోవటం ఏంది సారూ?

Update: 2020-04-13 02:30 GMT
అన్ని అలవాట్లను మార్చేసింది కరోనా. ప్రపంచం మొత్తాన్ని శాసిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా ఎన్నోకొత్త సీన్లను ఇప్పుడు చూస్తున్నాం. ఇలాంటివేళలోనూ కొందరిలో మార్పు లేకపోవటం.. ఇప్పటికి తమకు అలవాటైన ధోరణిలో వ్యవహరిస్తున్న వారు కొందరు కనిపిస్తారు. అలాంటి వారిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరుగా చెప్పాలి.

కరోనా పిశాచిని దగ్గరకు రాకుండా ఉండేలా చూసుకోవాలంటే కొన్ని అంశాల విషయంలో జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా రెండు చేతులు.. ముఖం మీదకు చేతుల్ని అస్సలు తీసుకెళ్లకూడదు. ఈ చిన్న విషయాన్ని అదే పనిగా మర్చిపోతుంటారు కేసీఆర్. కరోనా ముందు వరకూ ఎప్పుడో ఒకసారి మాత్రమే మీడియా సమావేశాన్ని నిర్వహించే ఆయన.. ఇటీవల కాలంలో మాత్రం ఆ అలవాటును మార్చేసుకున్నారు.

తరచూ మీడియా సమావేశాన్ని నిర్వహించి.. అన్ని అంశాల్ని ప్రజలకు వివరిస్తున్నారు. మిగిలిన మరే అధినేత కూడా ఈ రీతిలో విషయాల మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేయటం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.. దేశ ఆర్థిక పరిస్థితి? ఇప్పుడేం చేస్తామన్న విషయంతో పాటు.. నిధుల్ని ఎక్కడ తీసుకొస్తాం? ఎలా తీసుకొస్తాం? లాంటి ఎన్నో అంశాల్ని అందరికి అర్థమయ్యే రీతిలో వివరించే టాలెంట్ కేసీఆర్ లో ఎక్కువే. అన్ని బాగానే ఉన్నా.. కొన్ని విషయాల్లో మాత్రం ఆయన్ను తప్పు పట్టాల్సిందే.

మీడియా సమావేశంలో అదే పనిగా చేతి వేళ్లను ముక్కుల్లో పెట్టుకునే అలవాటును కేసీఆర్ ఎంత త్వరగా ఆపితే అంతమంచిది. నిజానికి కరోనా దరి చేరకుండా ఉండాలంటే ముఖ్యంగా చేతి వేళ్లను ముఖానికి దగ్గరగా రానివ్వకూడదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి అలవాట్లకు చెక్ చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ.. ఆ విషయాన్ని వదిలేసి.. అదే పనిగా ముఖానికి వేళ్లను దగ్గరగా తీసుకెళ్లటం.. అన్నింటికి మించి ముక్కులో వేళ్లు పెట్టుకోవటం లాంటి అలవాట్లను వెంటనే సారు బంద్ చేయటం మంచిది.లేకుంటే.. ఆయనకు సన్నిహితంగా ఉండేవారైనా చెప్పాల్సిన అవసరం ఉందంటున్నారు. వింటున్నారా సారూ?
Tags:    

Similar News