ఉద్యమ నేత కాస్తా సంపూర్ణ రాజకీయ నేతగా మారినప్పటికీ పాత వాసనలు పోవు కదా? గులాబీ బాస్.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు కూడా అదే తీరులో ఉంది. ఉద్యమ నేతగా ఉమ్మడి రాష్ట్రంలో ఆయనకున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తూ.. తాను ఒక్కడిగా సాగే ఉద్యమంలోకి ఒక్కొక్కరిని ఎలా చేర్చుకొని జట్టు కట్టారా? తాను అనుకున్న తెలంగాణను ఎలా సాధించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఒకప్పుడు తెగ పొగిడేసిన ప్రధాని నరేంద్ర మోడీని ఇప్పుడు తెగ తిట్టేస్తున్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఆయనపై యుద్దాన్నే ప్రకటించిన సంగతి తెలిసిందే. మోడీ లాంటి శక్తివంతమైన నేత.. కేంద్రంలో తిరుగులేని అధికారం చేతిలో ఉన్న కేంద్ర సర్కారును ఎదుర్కోవటానికి.. వారిపై రాజకీయ యుద్ధం చేయటానికి భారీ సైన్యం అవసరం. ఇప్పుడు ఆ సైన్యాన్ని సమకూర్చుకునే పనిలో పడ్డారు. తాజాగా ఆయన మాటల్ని విన్నప్పుడు.. సైన్యాన్ని సిద్ధం చేసుకోవటం కంటే కూడా.. తన మాటలతో ఆటోమేటిక్ గా వచ్చి చేరేలా ఆయన వ్యూహం సిద్ధం చేసినట్లుగా కనిపిస్తోంది.
సోమవారం తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. మోడీ సర్కారుపై తన యుద్ధాన్ని ఏ రీతిలో చేస్తానన్న విషయాన్ని తన ప్రసంగంలో చెప్పకనే చెప్పేశారు. అంతేకాదు.. తన సైన్యం ఎంత పెద్దదన్న విషయాన్ని ఆయన తెలియజేశారు. ఆయనకు దన్నుగా నిలవటానికి ఎవరు వస్తారన్న సందేహానికి తావు లేకుండా.. మోడీ సర్కారుపై బాణం ఎక్కు పెట్టిన కేసీఆర్.. దానికి అవసరమైన దన్నును 'విద్యుత్ సంస్థల' ఉద్యోగుల నుంచి పొందాలన్నది ఆయన యోచనలా కనిపిస్తోంది.
కేంద్ర విద్యుత్ బిల్లుపై మాట్లాడిన కేసీఆర్.. సంస్కరణల పేరుతో తీసుకొచ్చిన చట్టాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. ఇప్పటికే ఎల్ ఐసీ.. బీఎస్ఎన్ఎల్ సంస్థలను ప్రైవేటు పరం చేశారని.. ఇప్పుడు విద్యుత్ సంస్థలను కూడా ప్రైవేటు పరం చేయాలని కేంద్రం భావిస్తున్నట్లుగా చెప్పారు. కేంద్రం చేస్తున్న పని కారణంగా దేశంలోని విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న 20 లక్షల మంది ఉద్యోగాలు పోతాయని.. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలన్న మాటలతో తన ముడిసరుకు ఏమిటన్న విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పేశారు. ఎప్పటిలానే తాను చెప్పిన మాటలో తప్పులు ఉంటే సీఎం పదవికి రాజీనామా చేస్తానన్న భారీ మాట ఆయన నోటి నుంచి వచ్చేసింది.
నెహ్రూ కాలం నుంచి విద్యుత్ సంస్థలు.. డిస్కంలు.. ట్రాన్స్ కో.. జెన్ కోల ద్వారా ఆర్జించిన లక్షల కోట్ల ఆస్తుల్ని ప్రైవేటు షావుకార్లకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని.. దేశం దీనిపై మేల్కొని పోరాడాలన్నారు. ప్రజల ఆస్తులు.. ఎక్కడిదాకైనా కొట్లాడతమన్న ఆయన.. కేంద్రం తీసుకొచ్చే విద్యుత్ బిల్లుల కారణంగా భారీ ఎత్తున నష్టపోతారన్నారు.
అందుకే విద్యుత్ బిల్లును వెనక్కి తీసుకోవాలన్నారు. తెలంగాణ పోరాటాల గడ్డ అని.. పౌరుషాల గడ్డ అని.. ఇక్కడ మీ పిట్ట బెదిరింపులుపని చేయమన్నారు. '20 లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు జూలు విదిలించాలి. లక్షల కోట్ల విద్యుత్ ఆస్తులను కాపాడేందుకు ఉద్యమం చేయాలి' అంటూ తన ఎజెండాను చెప్పేశారు. మోడీ సర్కారుపై మొదలుపెట్టిన యుద్ధానికి మొదటగా 20 లక్షల మంది ఉన్న విద్యుత్ ఉద్యోగుల్ని తన ఆర్మీగా చేసుకోవాలన్నది కేసీఆర్ లక్ష్యమన్న మాట వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.