టీఆర్ ఎస్‌ కు ఓట‌మి...కేసీఆర్‌కు ముందే తెలుస‌ట‌!

Update: 2018-12-03 07:08 GMT
ఔను. టీఆర్ ఎస్ ఓట‌మి గురించి టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ముందే తెలుస‌ట‌.!అదేంటి..ఓ వైపు జోరుగా ప్ర‌చారం చేస్తూ వంద‌సీట్ల‌కు పైగా గెల‌వ‌బోతున్నామ‌ని ప్ర‌క‌టిస్తూ ఓట‌మి గురించి కేసీఆర్ ప్ర‌స్తావించ‌డం ఏంటని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? అదే ట్విస్ట్‌. కేసీఆర్ నిజంగా ఓడిపోవ‌డం లేద‌ట‌. ఓ స‌ర్వేలో ఆయ‌న్ను ఓడిస్తార‌ట‌. అయితే, ఆ స‌ర్వే త్వ‌ర‌లో వెలువ‌డ‌నుంద‌ట‌. అది త‌న‌కు ముందే లీక‌యింద‌ని - ఇలాంటి వాటి విష‌యాల్లో ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కేసీఆర్ కోరారు.

 ఆదివారం సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్‌ లో నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాదసభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభావేదికపై టీఆర్‌ ఎస్ మ్యానిఫెస్టోను విడుదల చేసిన అనంతరం టీఆర్‌ ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌ రావు ప్రసంగించారు. స్వార్థ‌ రాజకీయాలతో తెలుగుప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. శాంతియుతంగా - కలిసిమెలిసి జీవిస్తున్న ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రశాంతమైన భాగ్యనగర వాతావరణాన్ని చెడగొట్టేందుకు వస్తున్న చంద్రబాబుకు నగరపౌరులు గట్టిగా బుద్ధిచెబుదామని పిలుపునిచ్చారు. తనతోసహా మరెందరో హైదరాబాద్‌ కు వచ్చి స్థిరపడ్డారన్న సీఎం.. ఇక్కడివారంతా తాము హైదరాబాదీలమని గర్వంగా చెప్పుకోవాలని కోరారు. మీ వెంట నేనుంటానని భరోసానిచ్చారు.

రేపో మాపో డూప్లికేట్ సర్వే వెలుగులోకి రానుంద‌ని ఆయ‌న తెలిపారు. ``ఈరోజు నేను చెప్తున్నా.. రేపోమాపో ఒక డూప్లికేట్ సర్వే వెల్లడిస్తారు. దాన్లో టీఆర్‌ ఎస్‌ కు సంఖ్య రానట్టు - ఏదో మ్యానిప్యులేట్ చేయబోతున్నట్టు నా దగ్గర పూర్తి సమాచారం ఉంది. ఒక మీడియా సంస్థ - చంద్రబాబు - కొందరు కాంగ్రెస్ నాయకులు కలిసి కుట్ర చేస్తావున్నరు. నేను ఇయ్యాళ కేసీఆర్‌ గా డిక్లేర్‌ చేస్తున్నా! నిన్నా - ఇయ్యాల సర్వేలు చూశాను. అన్నిరకాల సర్వేలు వచ్చాయి. సభల ద్వారా వంద నియోజకవర్గాల ప్రజలను టచ్‌ చేసిన తర్వాత డిక్లేర్‌ చేస్తున్నా! నేను ఆదిలో చెప్పిన విధంగానే కచ్చితంగా వంద పైచిలుకు సీట్లలో టీఆర్‌ ఎస్ గెలువబోతున్నది. జంటనగరాల్లో జీహెచ్‌ ఎంసీ తీర్పు రిపీట్ కాబోతున్నది. ఇందులో ఎవరికీ అనుమానం అవసరం లేదు`` అంటూ వెల్ల‌డించారు. కాగా, స‌హ‌జంగానే కేసీఆర్ కామెంట్ల‌పై ఆస‌క్తి నెల‌కొంది. ఇలాంటి స‌ర్వేను వెలువ‌రించ‌బోయేది ఏ సంస్థ? స‌ద‌రు సంస్థ ఎందుకు టీఆర్ ఎస్ ఓడిపోతున్న‌ట్లు చెప్పాల‌నుకుంది? అనే చ‌ర్చోప‌చ‌ర్చ‌లు సాగుతున్నాయి.


Tags:    

Similar News