తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానని చెప్పే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత స్థలంలో ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ స్కూల్ లో వసతుల గురించి తాజాగా బయటకొచ్చిన వివరాలు కాస్తంత ఆసక్తిని రేకెత్తించటం ఖాయం.
పుష్కరాలు మొదలు కావటానికి కొద్ది రోజుల ముందు కేసీఆర్ వదిన మరణించటం.. ఆమె దశ దిన కర్మలు.. స్వగ్రామమైన చింతమడకలో బుధవారం జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సతీమణి.. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సీఎం భార్యగా కాకుండా సాదాసీదాగా ఉంటూ.. బంధువుల్ని.. పని వారిని పేరు పేరునా పిలుస్తూ.. తనకు పరిచయం ఉన్న వారు కనిపించకపోతే.. వారి గురించి ఆరా తీసిన వైనం పలువుర్ని ఆకట్టుకుంది.చింతమడకలో కేసీఆర్ కొన్ని స్థలాలు ఉన్నాయి. వీటిల్లో.. జిల్లా పరిషత్ స్కూల్.. పశు వైద్యశాల.. బ్యాంకులను ఏర్పాటు చేశారు. తమ భూముల్ని పరిశీలించిన ఆమె.. బ్యాంకు.. పాఠశాలలను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా.. పాఠశాలలో వసతుల గురించి వివరాలు అడిగారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వంట చేసే వారిని నీళ్ల వసతి గురించి అడిగితే.. నీళ్లు సరిగా రావటం లేదని చెప్పారు.
ట్యాంకు ఉందిగా అని అడిగిన సీఎం సతీమణి సందేహాన్ని తీరుస్తూ.. రిపేర్ వచ్చిందని.. అందుకే బయటకొచ్చి మరీ నీళ్లు తీసుకెళుతున్నామని వివరించారు. ఈ ఉదంతంలో ముఖ్యమంత్రి తప్పు కంటే కూడా.. అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. సాధారణంగా.. ముఖ్యమంత్రి చెందిన వాటికి సంబంధించి ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ.. అలాంటి వాటిని కూడా పట్టించుకోకుండా నిద్ర పోతున్న అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ముఖ్యమంత్రికి చెందిన స్కూల్ లోనే వసతులు ఇలా ఉంటే.. మిగిలిన స్కూళ్ల సంగతి ఏమిటన్నది ఒక ప్రశ్న. విఫక్షాల మొదలు మీడియా వరకు కన్ను ప్రముఖులకు చెందిన అంశాల మీద ఉంటాయని తెలిసి.. అధికారులు చూసీ చూడనట్లుగా ఉన్నారంటే దీన్ని బాధ్యతారాహిత్యం అనాలా? లేక.. బరి తెగింపు అనాలా? మొత్తానికి రాష్ట్రాన్ని ఏదో చేస్తానని చెప్పే కేసీఆర్ మాటకు కౌంటర్ గా.. ముందు మీ స్థలంలో ఏర్పాటు చేసిన స్కూల్ వసతుల గురించి ముందు ఆలోచించండని ఎద్దేవా చేసేలా అధికారులు అవకాశం ఇచ్చారని చెప్పక తప్పదు.