తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరోమారు తనదైన శైలిలో మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. `నువ్వు రాజీవ్ గాంధీ కొడుకు అవునో కాదో అని మేము ప్రూఫ్ అడిగామా?`` అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ కామెంట్లు చేసిన ఎపిసోడ్ పై కేసీఆర్ భగ్గుమన్నారు. భువనగిరి జిల్లాలోని రాయగిరిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి పార్లమెంట్‌లో జరిగిన అవమానం గురించి ప్రస్తావించారు. ``అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీ గురించి ఈ మాట అనొచ్చునా.. ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ సంస్కారం ఇదేనా?`` అంటూ ప్రశ్నించారు.
రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యల గురించి కేసీఆర్ ప్రస్తావిస్తూ, ``రాహుల్ గాంధీ అనే ఎంపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయనతో నాకు సంబంధం లేదు. కానీ.. వాళ్ల నాయనమ్మ, నాన్న ఈ దేశం కోసం చనిపోయారు. వాళ్ల తాత స్వతంత్ర పోరాటం చేసి అనేక సంవత్సరాలు ప్రధాన మంత్రిగా పని చేశారు. ఇవాళ రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్నాడు. రాజకీయాల్లో ఉన్నప్పుడు మాట్లాడుతం. చర్చ జరుగుతది. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు అడుగుతరు. ప్రజల తరుపున ప్రజాప్రతినిధులు కూడా అడుగుతారు. రాహుల్ గాంధీ ఏదో అడిగితే.. అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడారండి.. .. మన హిందూ ధర్మం ఇదేనా.. మన దేశం మర్యాద ఇదేనా.. ఒక నేతను పట్టుకొని ఏం మాటలు మాట్లాడున్నారు.. ముఖ్యమంత్రి అలాంటివి అడుగుతారా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
రాహుల్ గాంధీపై చేసిన కామెంట్లకు తనకే కళ్లలో నీళ్లు తిరిగాయని, తల దించుకున్నంత పని అయిందని కేసీఆర్ తెలిపారు. ``ఒక ఎంపీని పట్టుకొని మీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా. మహాభారతం, రామయణం, భగవద్గీత నుంచి మనం నేర్చుకున్నది ఇదేనా. హిందు ధర్మాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఓట్లు రాల్చుకుంటున్నారు. బీజేపీ అధ్యక్షుడినే నేను అడుగుతున్నా. ఇదేనా మీ సంస్కారం. వెంటనే అస్సాం ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయండి`` అని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు.