రైతుల ఆత్మహత్యలపై హాట్ హాట్ గా సాగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఏడంటే.. ఏడు నిమిషాలు మాత్రమే జరిగాయి. అనంతరం సోమవారం వరకూ వాయిదా పడ్డాయి. దీనిపై విపక్షాలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి.
అసెంబ్లీ దగ్గర సీన్ ఇలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేస్తున్నారు? అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు ఆసక్తికర సమాధానాలు తెర మీదకు వచ్చాయి. హైదరాబాద్ ను విశ్వనగరంగా చేసే క్రమంలో హైదరాబాద్ కు ఒక ఐకాన్ అందివ్వాలన్న ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎప్పటి నుంచో ఉంది. ఇందుకోసం ఆయన ఇప్పటికే కొన్ని ఆలోచనలు చేశారు. వీటిల్లో ఒకటి అతి పెద్ద టవర్ ను హుస్సేన్ సాగర్ తీరంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
ఇందుకోసం గురువారం దాదాపు మూడు గంటల పాటు చర్చ జరిపారు. ఈ సందర్భంగా ఒక విచిత్రమైన విధానాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి అనుసరించారు. తన కార్యాలయంలో అటెండర్ గా పని చేసే ఎల్లయ్య మొదలు.. తెలంగాణ రాష్ట్ర సీఎస్ వరకూ ఈ అంశం మీద అందరి అభిప్రాయాలు పిలిచి మరీ తెలుసుకోవటం విశేషం. తన కార్యాలయంలో పని చేసే ప్రతి ఉద్యోగిని పేరు పేరునా పిలిచి.. భారీ టవర్ నిర్మాణంపై వారి అభిప్రాయం చెప్పాలని కోరారు.
ఈ భారీ టవర్ కు ఏం పేరు పెడదాం? ఎన్ని అంతస్థులు ఉండాలి? ఎలా చేద్దాం? మీ అభిప్రాయం ఏందన్న ప్రశ్నల్ని సంధించినట్లు చెబుతున్నారు. వారు చెప్పేదాన్ని జాగ్రత్తగా విన్న కేసీఆర్.. ఈ టవర్స్ కు తెలంగాణ సిగ్నేచర్ అన్న పేరుతో వ్యవహరించాలని అనుకున్నట్లుగా చెబుతున్నారు. ఇక.. అంతస్తుల విషయానికి వస్తే.. ఈ భారీ సౌదం 150 అంతస్తుల్లో ఉండాలని అభిప్రాయపడినట్లుగా చెబుతున్నారు.
దేశంలోకెల్లా ఎత్తైన టవర్ నిర్మాణం ముంబయిలో జరుగుతుందని.. 116 అంతస్తుల్లో నిర్మిస్తున్న ఈ టవర్ కు మించిన ఎత్తుతో రాష్ట్రంలో నిర్మించాలని భావిస్తున్నట్లుగా కేసీఆర్ చెప్పగా.. పెద్ద ఎత్తున సానుకూలత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఒక అధికారి మాట్లాడుతూ.. ‘‘సార్.. మీ లక్కీ నెంబరు 6. అందుకే ఈ టవర్స్ ను 156 అంతస్తుల్లో నిర్మిద్దాం’’ అని ఓ ఉన్నతాధికారి అనగా.. మరో అధికారి మాట్లాడుతూ.. ‘‘150 అంకెను కూడితే వచ్చేది 6 నెంబరే. అందుకే.. ఈ టవర్ ను 150 అంతస్తుల్లో నిర్మిస్తే బాగుంటుంది’’ అని చెప్పినట్లుగా తెలిసింది.
హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశ హర్మ్యాలు ఏర్పాటు చేయాలని గతంలో భావించినా.. కోర్టు చిక్కులతో ఈ ప్రాజెక్టుకు బ్రేకులు పడ్డాయి. అలాంటి ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకోకుండా ఉండేలా.. తాజా నిర్మాణం ఉండాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. తాజా టవర్స్ భారత్ దేశానికి ఒక బహుమానంగా.. హైదరాబాద్ మార్క్ ప్రపంచంలో ప్రముఖంగా కనిపించేలా నిర్మించాలన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. దీంతో పాటు.. ఆరు వరుసలతో భారీ ఎలివేటర్ ను సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ నుంచి హకీంపేట ఎయిర్ బేస్ వరకూ 11 కిలోమీటర్ల మేర రూ.వెయ్యి కోట్లతో ఆకాశ మార్గాన్ని నిర్మించాలన్న ఆలోచన కూడా చేశారు. దీంతో పాటు.. బాలానగర్ నుంచి నర్సాపూర్ రోడ్డుకు అనుసంధానిస్తూ మరో కారిడార్ ను నిర్మించాలని.. ఇందుకోసం మరో రూ.700కోట్లు అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. ఓ పక్క దిక్కుతోచని స్థితిలో తెలంగాణ అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. మరోవైపు ఆకాశ హర్మ్యాల గురించి ఆలోచించటం ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే సాధ్యమేమో..?