ఎవరెన్ని చెప్పినా.. రాజకీయ నేతకు.. జర్నలిస్టుకు మధ్యనున్న అనుబంధం కాస్త భిన్నమైనదే చెప్పాలి. నిత్యం ప్రజలతో సంబంధాలతో పాటు.. తమ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు మదింపు చేసే అలవాటు చాలామంది జర్నలిస్టుల్లో కనిపిస్తూ ఉంటుంది. అలా అని.. చాలామంది చూసే బ్లాక్ మొయిల్ జర్నలిస్టుల గురించి మేం ఇక్కడ చెప్పట్లేదు. ఇప్పటి రోజుల్లోనూ సమాజం గురించి.. ప్రజల గురించి.. వారి అవసరాల గురించి తపించే జర్నలిస్టులకు కొదవ లేదు. ఎవరిదాకానో ఎందుకు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంగతే తీసుకోండి. వారం పాటు దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఆయన.. కేంద్రంలోని ఎవరిని కలిసింది లేదు. అలా అని ఆయన ఖాళీగా కూడా లేరు.
వేర్వేరు రంగాలకు చెందిన వారితో వరుస భేటీలు జరుపుతున్న ఆయన.. తాను ఎంపిక చేసుకున్న జర్నలిస్టులను ప్రత్యేకంగా పిలిపించుకొని మరీ గంటల కొద్దీ మాట్లాడుకోవటం.. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లు చెబుతారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఇదే కేసీఆర్ తాను ప్రెస్ మీట్ పెట్టిన వేళలో మాత్రం.. జర్నలిస్టులను చులకన చేసేలా మాట్లాడతారు. అదే కేసీఆర్ మళ్లీ జర్నలిస్టులను తన వద్దకు పిలిపించుకొని మాట్లాడే వేళలో.. ఆయన ప్రదర్శించిన గౌరవ మర్యాదల్ని చూసిన వారు ఫిదా అవుతుంటారు. ఇలాంటి విలక్షణ కోణం కేసీఆర్ లో కనిపిస్తూ ఉంటుంది.
ఆ మాటకు వస్తే.. తెలంగాణ ఉద్యమ సమయంలో మీడియా నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొని.. తన రాజకీయ వ్యూహాన్ని ఎప్పటికప్పుడు పదును పెట్టుకున్న ఆయన.. తన చేతికి అధికారం వచ్చిన తర్వాత.. వారి వెతల్ని తీరుస్తానన్న మాటను తరచూ చెప్పేశారు. అలాంటి కేసీఆర్.. ముఖ్యమంత్రిగా ఎనిమిదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ పాత్రికేయులకు ఒరిగింది మాత్రం శూన్యమన్న మాట జర్నలిస్టుల్లో వినిపిస్తూ ఉంటుంది.
గత ఎన్నికలకు ముందు మీడియా ప్రతినిధులతో మాట్లాడే సందర్భంలో ట్రిఫుల్ బెడ్రూంలను కట్టి ఇస్తానని చెప్పిన ఆయన.. ఇప్పటివరకు ఆ విషయాన్ని ఒక్క అడుగు కూడా ముందుకు పడకుండా చేయటం చూసినప్పుడు ఆయనలోని వేర్వేరు మనుషులు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మీడియాను ఒక ఆయధంగా వాడుకోవటం.. జర్నలిస్టుల్ని ఆ ఆయుధానికి మందుగుండుగా వాడుకోవటంలో కేసీఆర్ కు మించినోళ్లు ఉండరనే చెప్పాలి.
ఎక్కడైనా తమకు సాయం చేసిన వారికి.. అండగా నిలిచిన వారిని నెత్తిన పెట్టుకోవటం చూస్తుంటాం. అందుకు భిన్నంగా కేసీఆర్ ఎందుకిలా? వ్యవహరిస్తున్నట్లు? అన్నది ప్రశ్న. దీనికి పలువురు చెప్పే సమాధానం ఏమంటే.. కాలే కడుపు కాలుతూనే ఉండాలని.. కడుపు నిండితే తనను పట్టించుకోరన్న ఉద్దేశమే కారణమంటారు. ఆశగా తనను ఎప్పుడూ చూస్తుండాలనే ఉద్దేశమే.. తాజా దుస్థితికి కారణమంటున్నారు.
అందరికి అన్ని చేస్తానని మాట ఇచ్చేస్తూ.. కొంత మేర అయినా పనులు చేసే ఆయన.. జర్నలిస్టులను మాత్రం కరివేపాకులా వాడేయటం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెబుతారు. ఇప్పటికైనా ఆయన తన తీరును మార్చుకోకుండా కరివేపాకు కాస్తా వేపాకులా మారిని ఆయనకు చేదు కలిగేలా చేస్తాయమంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.