ప్రజాప్రతినిధుల్ని ప్రజలు నిలదీయటం అప్పుడప్పుడు చూస్తుంటాం. కానీ.. ఒక చిన్నారి ఎమ్మెల్యేను క్వశ్చన్ చేయటం చాలా తక్కువగా చూస్తాం. తాజాగా అలాంటి సీనే ఒకటి చోటు చేసుకుంది. మరి.. చిన్నారి తనను నిలదీసిన వైనంపై సదరు ఎమ్మెల్యే రియాక్షన్ ఎలా ఉంది? ఆయనేం చేశారన్నది చూస్తే.. ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు పాజిటివ్ గా రియాక్ట్ అయితే వచ్చే లాభం ఏమిటో తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది.
ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు ఖైరతాబాద్ బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి. ఎమ్మెల్యే ను అడిగితే తమ సమస్య తీరుతుందన్న ఆలోచన వచ్చిన ఆ చిట్టి తల్లి.. ఎలాంటి త్రోటుపాటు లేకుండా.. వారం రోజులుగా మాకు నల్లా నీళ్లు రావట్లేదు.. అధికారులకు చెబితే వినటం లేదు.. నల్లా నీళ్లు ఎందుకు రావట్లేదో మీరైనా అడిగి చెబుతారా? అంటూ ధైర్యంగానే అడిగేసింది.
ఒక్కక్షణం ఆయన షాక్ తిన్నట్లు ఉన్నా.. ఆ చిన్నారి నిలదీతను పాజటివ్ గా రియాక్ట్ అయిన ఆయన వాటర్ బోర్డు అధికారులకు ఫోన్ చేశారు. వారం రోజులుగా నీళ్లు ఎందుకు రావట్లేదో అడిగి తెలుసుకొని.. 24 గంటల వ్యవధిలో సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.
ఆ బాలిక వివరాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే.. రోజు వ్యవధిలో నీళ్లు వస్తాయన్న అభయమిచ్చారు. ఇలా.. ధైర్యంగా వచ్చి సమస్యల గురించి అడిగితే బాగుంటుందంటూ పాపను మెచ్చుకున్నారు. నిలదీయటం ఇబ్బందే అయినా.. దాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకోవటంలో బీజేపీ ఎమ్మెల్యే నేర్పును మిగిలిన ఎమ్మెల్యేలు కూడా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది.