ప్రస్తుత కాలంలో...చిన్న సహాయం చేస్తేనే...ప్రస్తుత పరిస్థితుల్లో పది కాలాల పాటు గుర్తుంచుకుంటారు. అలాంటిది ప్రాణం పోసేటటువంటి సహాయం చేస్తే...అందులోనూ పండంటి బుజ్జాయికి పునర్జన్మను ప్రసాదిస్తే... ఆ తల్లిదండ్రుల ఆనందం వర్ణణాతీతం. ఆ దయాహృదయుడిని దేవుడితో పోలుస్తారు. ఇలాంటి సంఘటన సోషల్ మీడియా వేదికగా తెరమీదకు వచ్చింది. అలాంటి సహాయం చేసింది మంత్రి కేటీఆర్ కాగా....ఆ బుజ్జాయి పేరు వర్ణిక.
సిరిసిల్లా జిల్లాలోని వేములవాడ నూకలమర్రికి చెందిన ఆడెపు శ్రీధర్ తనయ వర్ణిక తీవ్ర అనారోగ్య సమస్యతో కరీంనగర్ లోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఆమెకు వైద్యసహాయం చేసేందుకు సొమ్ములు లేకపోవడంలో...మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా సహాయం కోరారు. అయితే ఇదే సమయంలో మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటనలో ఉన్నారు. అయినప్పటికీ...ఆ ట్వీట్ కు స్పందించి వెంటనే అధికారులను సమన్వయం చేసిన మంత్రి కేటీఆర్...సీఎంఆర్ ఎఫ్ నుంచి సహాయం అందేలా చేశారు. దీంతో ఆ పాప ఆరోగ్యం కుదుటపడింది. ఈ నేపథ్యంలో బుజ్జాయి వర్ణిక తండ్రి శ్రీధర్ మరోమారు మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశారు. ‘గౌరవనీయులు కేటీఆర్ సారుకు..మా పాప వర్ణికకు వైద్యాసహాయానికి సహకరించి పాపకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన దేవుడు మీరు’ అని తమ కృతజ్ఞతలు చాటుకున్నారు.
కాగా, దీనికి మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘మీ పాప కోలుకోవడం చాలా సంతోషకరం సోదరా. మీకో చిన్న విన్నపం. మనుషుల నుంచి దేవుళ్లను సృష్టించడం సరికాదు. ప్రజల చేత ఎన్నుకున్న వారిగా మా బాధ్యతను నిర్వర్తిస్తున్నాం’ అని స్పందించారు. కాగా - పలువురు నెటిజన్లు..మంత్రి కేటీఆర్ సహాయాన్ని - అనంతరం ఆయన స్పందన తీరును ప్రశంసిస్తూ..ట్వీట్లు చేశారు. ఇదిలాఉండగా..మరికొందరు సైతం తమ సంబంధికులకు ఉన్న ఆరోగ్య సమస్యలను పేర్కొంటూ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేయగా...దానికి స్పందిస్తూ..ఆయన తమ సిబ్బందిని సహాయం చేయవల్సిందిగా కోరారు.