సీఐఏ కస్టడీలో కిమ్‌ అన్నకొడుకు... ప్రాణాల కోసం పారిపోయి చివరికి !

Update: 2020-11-19 01:30 GMT
ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే కిమ్ ఓ అత్యంత క్రూరమైన నియంతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ దేశం మొత్తం కిమ్ కనుసన్నుల్లో నడుస్తుంది. అక్కడ ఏం జరగాలన్న కూడా కిమ్ ఆదేశం ఉండాల్సిందే. కిమ్‌‌ అన్న కిమ్‌ జోంగ్‌ నామ్ ను మలేషియా విమానాశ్రయంలో ఇద్దరు మహిళల విషప్రయోగంతో చంపాడు. ఆ ఘటన తర్వాత అతని కుమారుడు కిమ్‌ హాన్-సోల్, ఇతర కుటుంబ సభ్యులు ఎవరికీ ఇష్టం వచ్చిన ప్లేస్ కి వారు పారిపోయారు. అలా దేశదేశాలు తిరుగుతూ సోల్‌ అమెరికా నిఘా సంస్ధ అధికారులకు పట్టుబడినట్లు తెలుస్తోంది. దీంతో వారు ప్రస్తుతం వారి అదుపులోనే అతన్ని ఉంచారు

2017 ఫిబ్రవరిలో ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అన్న కిమ్ జోంగ్ నామ్ మలేషియాలోని ఓ రద్దీ విమానాశ్రయంలో జరిగిన దారుణమైన దాడిలో హత్యకు గురయ్యాడు. ఇద్దరు మహిళలు అతన్ని పట్టపగలే విషపూరిత పదార్థాన్ని ప్రయోగించి హత్యచేశారు. దీనితో ఉత్తర కొరియా ప్రభుత్వంపై అనుమానాలు మొదలయ్యాయి. అదే సమయంలో అతని భార్య మరియు అతని ఇద్దరు పిల్లల్ని కూడా చంపేస్తారని అంతా భావించారు. కానీ మకావు వెళ్లిన ఈ కుటుంబం ఆ తర్వాత పశ్చిమ దేశాలకు వెళ్లి రాజకీయ ఆశ్రయం పొందాలని భావించింది. కానీ ఒకే చోట ఉంటే చనిపోతామని భావించి వారు ఎవరికీ తోచినట్టు వారు పారిపోయారు.

ఇంటెల్‌ న్యూస్‌ సమాచారం బట్టి చూస్తే కిమ్ జోంగ్-నామ్ పెద్ద కుమారుడు కిమ్ హాన్-సోల్ ఉత్తరకొరియాలో చెయోలిమా-డిఫెన్స్ ‌గా పిలిచే ఓ తిరుగుబాటు వర్గం సాయం తీసుకున్నాడు. అప్పట్లో కిమ్ ‌కు వ్యతిరేకంగా గళమెత్తే వారికి వీరు అండగా నిలిచేవారు. అలా కిమ్‌ అన్నకొడుకు కిమ్‌ హాన్‌ సోల్‌ కు కూడా వీరు సాయం చేశారు. దీంతో ఆయన దేశం వదిలి పారిపోయాడు. వీరి చెయోలిమా డిఫెన్స్‌ సాయంతో కిమ్‌ కుటుంబం ఉత్తరకొరియా నుంచి తిరుగుబాటు గ్రూపుల సాయంతో పశ్చిమదేశాలకు పారిపోయింది.

ఆ సమయంలో కిమ్ వీరికోసం ఎంతగా ప్రయత్నం చేసినా కూడా వీరి ఆచూకీ అలభించలేదు. కిమ్ భయంతో కిమ్‌ హాన్‌ సోల్‌ కుటుంబం యూరప్‌ వెళ్లిపోగా.. కిమ్‌ హాన్‌ సోల్‌ మాత్రం తైవాన్‌ కు వెళ్లాడు. అక్కడ చెయోలిమా సివిల్‌ డిఫెన్స్‌ సభ్యులు ఆయనకు భద్రత కల్పించారు. అక్కడి నుంచి కిమ్ హాన్‌ సోల్‌ ఆమ్‌ స్టర్ ‌డామ్ ‌లోని షిపోల్ ఎయిర్‌ పోర్టుకు వెళ్లగా అక్కడ కాపు కాసిన సీఐఏ అధికారులు ఆయన్ను నిర్బంధించారు. అక్కడి నుంచి అతన్ని అమెరికా తరలించినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి ఆయన సీఐఏ అదుపులోనే ఉన్నట్లు సమాచారం. కిమ్ తో సంబంధాల నేపథ్యంలో అమెరికా అతని అన్న కొడుకును అప్పగిస్తుందా లేక విచారణ జరుపుతుందా అన్నది తెలియాలి.
Tags:    

Similar News