గ్రామ పంచాయతీలకు కేంద్రం ఎంత.. రాష్ట్రం ఎంత ఇచ్చిందో సీఎం కేసీఆర్ చర్చకు సిద్ధమా అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న బెంగళూరుకు వెళ్లి దేశ మాజీ ప్రధాని దేవెగౌడను కలిసి రెండు నెలల్లో సంచలనం సృష్టిస్తామని వ్యాఖ్యలు చేశారని.. ఇలా గతంలో కూడా చేశారని ఆయన ఎద్దేవా చేశారు. రజాకార్ల వారసులు, నిజాం వారసులు కలిసి తెలంగాణను ముంచుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో తప్పకుండా మార్పు వస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణలో తప్పకుండా మార్పు వస్తుందని కిషన్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, వారు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలు అనుకున్న వారినే గెలిపించారని.. వందల కోట్లు ఖర్చు చేసినా సరే ప్రజలు అనుకున్న వారికే ఓట్లు వేశారని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్కు వ్యతిరేకంగా ఫలితాలు వస్తాయని.. బీజేపీ పై టీఆర్ ఎస్ ఎంత విషం చిమ్మినా ఆ పార్టీకి ప్రజలు ఓట్లు వేయరన్నారు. ఎస్సీ సమాజానికి కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం వారిని సీఎం చేస్తారా అంటూ ప్రశ్నించారు.
సిద్ధాంతపరంగా కుటుంబ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని.. ప్రధానంగా కుటుంబ పార్టీలను వ్యతిరేకిస్తున్నామన్నారు. కుటుంబపార్టీలు పూర్తిగా దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని కేంద్ర మంత్రి మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న బెంగళూరుకు వెళ్లి దేశ మాజీ ప్రధాని దేవెగౌడను కలిసి రెండు నెలల్లో సంచలనం సృష్టిస్తామని వ్యాఖ్యలు చేశారని వెల్లడించారు. ఇలా సీఎం గతంలో కూడా ప్రళయం సృష్టిస్తా, భూకంపం సృష్టిస్తా, బీజేపీని బంగాళాఖాతంలో కలపాలి అని ఎన్నో వ్యాఖ్యలు చేశారని ఆయన ఎద్దేవా చేశారు. గుణాత్మక మార్పు అన్నారు.. ముందు వారి పార్టీలో గుణాత్మక మార్పు రావాలని కిషన్రెడ్డి విమర్శించారు.
నెలకు 18 గంటల పని
ప్రధాని మోడీ రోజుకు 18 గంటలు పనిచేస్తారు.. అదే కేసీఆర్ నెలకు 18 గంటలు పని చేస్తారని కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ''తెలంగాణ భవిష్యత్ కేసీఆర్ చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. 8 ఏండ్లలో తెలంగాణను దోచుకుంది సరిపోదా?.మీలో గుణాత్మకమైన మార్పు లేకుండా మార్పు సాధ్యమా. మీలో మార్పు రాకపోవచ్చు.. కానీ ప్రజలు దాన్ని మారుస్తారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పట్టం కడతారు. కేసీఆర్ బీజేపీపై ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కేసీఆర్కు సంబంధించిన మీడియా బీజేపీపై బూటకపు వార్తలు రాస్తోంది. మాది గుజరాత్ పార్టీ అంటారా?. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ మాది.'' అని కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు.
కల్వ కుంటుంబానికి శాపం ఉంది!
బీజేపీలో అధ్యక్షుడికి 2 దఫాలుగా మాత్రమే అవకాశం ఉంటుంది.. కానీ కేసీఆర్ పార్టీలో సర్వం మీరే. జేపీ నడ్డా, ప్రధాని మోడీ తరువాత వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులు ఎవరూ ఉండరు. ఇలా మీకు చెప్పే దమ్ముందా?. ఇదేమైనా రాజుల రాజ్యమా?. కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు జీపీఏ రాసిచ్చారా. కల్వకుంట్ల కుటుంబానికి శాపం ఉన్నట్లుంది. నిజం చెబితే 1000 ముక్కలు అవుతుందనే శాపం ఉంది అనుకుంటా. అందుకే వారు నిజం చెప్పడానికి భయపడుతున్నారు. తెలంగాణకు కేంద్రం ఏం ఇవ్వకుండానే ఇంత అభివృద్ధి సాధ్యమైందా అని కిషన్ రెడ్డి నిలదీశారు.