తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ జేఏసీ ఛైర్మన్ కోదండరాం పెదవి విరిచారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నిరుత్సాహంగా ఉందని విమర్శించారు. పలు వర్గాలను ఎంతో ఊరించి అనుకున్న రీతిలో కేటాయింపులు చేయలేదని వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్ సాగుదారులకు సాయం చేసేలా లేదన్నారు. నిరాశచ - నిస్తృహల్లో ఉన్న రైతులకు భరోసా ఇవ్వలేకపోయిందన్నారు. త్వరలో అంశాల వారీగా ఆందోళనలు చేపడతామన్నారు. హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లిలో రైతు జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర సదస్సుకు కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రైతు సంఘాల నేతలు, వ్యవసాయ రంగ నిపుణులు, రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ దేశంలో రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. ఇంతటి కీలక అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం సరికాదని పేర్కొన్నారు.ఈ సందర్భంగా తమ పోరాట కార్యచరను సైతం ప్రకటించారు. రైతుల సమస్యలపై పోరాడేందుకు 24 మందితో రైతు జేఏసీ తాత్కాలిక కమిటీని నియమించామని, అందులో తాను కూడా ఒక సభ్యుడినని తెలంగాణ కోదండరాం తెలిపారు. ప్రాజెక్టుల పేరుతో రైతుల భూములను ప్రభుత్వం లాక్కుంటున్నదని కోదండరాం విమర్శించారు. వ్యవసాయ అనుబంధ రంగాలలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏ మార్పు లేదని వ్యాఖ్యానించారు. పంట ధరల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని, గొర్రెలను ఇస్తున్నారు కానీ వాటికి వైద్యం అందించేందుకు వెటర్నరీ ఆసుపత్రులను మెరుగుపరుస్తున్పారా అని కోదండరాం ప్రశ్నించారు. రైతులకు లాభసాటి ధర లభించేలా కర్ణాటక తరహాలో ఒక నిధిని ఏర్పాటు చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన ప్రతిపాదనలతో అన్నదాతలకు మేలు చేయాలని కోరారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/