ఆ దెబ్బకు బాబు తెలంగాణకు రాడు..

Update: 2019-01-07 05:35 GMT
కంప్యూటర్ ను తానే కనిపెట్టానని డబ్బా కొట్టుకునే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆ కంప్యూటర్ ఆధారంగా తయారైన ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారనడం విడ్డూరంగా ఉందని టీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. హైటెక్ బాబుకు ఈవీఎంలలో ఎలాంటి చిప్ లు పెడుతారు.. దాని పనితనం గురించి బాగా తెలుసని.. అలా ఎలా మాట్లాడుతారంటూ సెటైర్ వేశారు.

తెలంగాణ భవన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడారు. చంద్రబాబుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఏపీకి వెళ్లవలసిన అవసరం లేదని కుండబద్దలు కొట్టారు.  టీఆర్ఎస్ కు వచ్చిన ఓటింగ్ శాతం దృష్ట్యా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 16 స్థానాల్లో టీ ఆర్ ఎస్ గెలవడం ఖాయమని తేల్చిచెప్పారు. ఈసారి టీ ఆర్ ఎస్ కు ఇంకా ఎక్కువ ఓట్లు పడుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయడానికి అభ్యర్థులే దొరకడం లేదని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు తెలంగాణలో ప్రచారం చేయడం వల్లే టీ ఆర్ ఎస్ గెలిచిందన్న విమర్శలకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఎన్నికల ప్రచారానికి ముందే తెలంగాణ ప్రజలు టీ ఆర్ ఎస్ ను గెలిపించాలని డిసైడ్ అయ్యారని.. బాబు వల్ల వారి వైఖరి మారలేదని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు.

తెలంగాణలో చిత్తుగా ఓడిపోయిన చంద్రబాబు ఇక తెలంగాణ రాజకీయాల్లోకి రాడని.. మహాకూటమిలో కొనసాగడని.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ చంద్రబాబు పార్టీ పోటీచేయదని కేటీఆర్ స్పష్టం చేశారు. వారికి ఆ ధైర్యం ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు.

జాతీయ రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ  కాంగ్రెస్, బీజేపీ రెండూ జాతీయ రాజకీయాల్లో సొంతంగా మెజార్టీ సాధించలేవని.. లోక్ సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో టీ ఆర్ ఎస్ కీరోల్ పోషిస్తోందని కేటీఆర్ తెలిపారు.

ఇక టీజేఎస్ అధినేత కోదండరాం గురించి అడిగినప్పుడు కేటీఆర్ స్పందించారు. తెలంగాణ ప్రజలు కోదండరాంను తిరస్కరించారు. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో కొనసాగాలా వద్దా తేల్చుకోవాలంటూ కేటీఆర్ సెటైర్ వేశారు. ఒకవేళ ఆయన కాంగ్రెస్ తోనే కొనసాగితే వాళ్లు హైదరాబాద్, కరీంనగర్ వంటి ఓడిపోయే సీట్లను కోదండరాంకు అప్పగించే అవకాశాలున్నాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

కేసీఆర్ ఈసారి నల్గొండ జిల్లా నుంచి లోక్ సభకు పోటీచేస్తారా అన్న ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిచ్చారు. కేసీఆర్ లోక్ సభకు ఎందుకు పోటీపడుతారు.? ఎప్పుడు ఏం చేయాలో కేసీఆర్ కు బాగా తెలుసు.. అన్నీ ఆలోచించే కేసీఆర్ నిర్ణయిస్తామని.. తాము ఆయన ఆదేశాలను అమలు చేస్తామని కేటీఆర్ అన్నారు.





Full View
Tags:    

Similar News