ఒక చిన్న మాట ఒక భరోసాగా మారితే అంతకు మించి కావాల్సిందేముంది? అలాంటి భరోసా పవర్ చేతిలో ఉన్న వ్యక్తి నుంచి అయితే ఆ తీరే వేరుగా ఉంటుంది. చాలామంది చేతిలో పవర్ ఉంటుంది.కానీ.. కొందరు మాత్రమే దాన్ని నూటికి నూరు శాతం న్యాయం చేస్తుంటారు. అలాంటి కోవలోకే వస్తారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. రాజకీయంగా ఆయనలో కొన్ని లోపాలు లేకపోలేదు. ఆయనపై ఆరోపణలు ఉండవని కూడా చెప్పట్లేదు. కానీ.. వాటన్నింటికి మించి.. ఆయన తీరు అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు.. భరోసాన్ని.. బలాన్ని ఇచ్చేలా ఉంటుంది. నిజానికి అదే.. మంత్రి కేటీఆర్ ను మిగిలిన వారికి బిన్నంగా నిలుపుతుందని చెప్పొచ్చు.
తన మంత్రివర్గ శాఖల విషయంలో మహా చురుగ్గా ఉంటూ.. అధికారుల్ని పరుగులు పెట్టించే కేటీఆర్.. సోషల్ మీడియాలోనూ అంతే స్పీడ్ గా ఉంటారు. సాయం అంటూ అడిగిన ఎవరిని కాదనకుండా ఉండటం.. వారు అడిగినదాన్లో న్యాయం ఉంటే.. మరింకేమీ ఆలోచించకుండా దూసుకెళ్లే తత్త్వం కేటీఆర్ లో ఎక్కువనే చెప్పాలి. సోషల్ మీడియాతో పాటు.. ఆయన వాట్సప్ కు మెసేజ్ పెట్టే వాటి విషయంలోనూ ఆయనెంత పాజిటివ్ గా రియాక్ట్ అవుతారో చెప్పటానికి తాజా ఉదంతమే నిదర్శనం.
సాదాసీదా జనాల వాట్సప్ లలో నిత్యం వందలాది మెసేజ్ లు రావటం.. వాటిని చూడలేక.. అలా తిప్పేసే వాళ్లు చాలామంది ఉంటారు. అలాంటిది ఒక మంత్రి వాట్సప్ కు వచ్చే మెసేజ్ లు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకున్న పనుల ఒత్తిడిలో.. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మంత్రి కేటీఆర్ ప్రదర్శించే శ్రద్ధ చూస్తే.. సమస్యల పట్ల ఆయన తీరు ఏమిటన్నది ఇట్టే అర్థమవుతుంది.
తాజాగా కేటీఆర్ వాట్సప్ కు ఒక మెసేజ్ వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు లోని రహీంఖాన్ మార్కండేయ చేనేత సహకార సంఘంలో చాలా చీరలు అమ్ముడు కాకుండా ఉన్నాయని.. దీంతో అక్కడి కార్మికులు ఇబ్బందులు పడుతున్నట్లుగా సంఘ అధ్యక్షులు సత్యనారాయణ కేటీఆర్ కు మెసేజ్ పెట్టారు. ఇటీవల కాలంలో చేనేత వస్త్రాలపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.
మెసేజ్ రావటం.. కేటీఆర్ రియాక్ట్ కావటం.. ఆ సహకార సంఘాన్నిసందర్శించి సమస్యను పరిష్కరించాలంటూ టెస్కో జాయింట్ డైరెక్టర్ యాదగిరిని ఆదేశించారు. దీంతో.. ఆయన సదరు సంఘాన్ని సందర్శించి రూ.3లక్షల విలువైన చీరలు కొనుగోలు చేశారు. అంతేకాదు.. తమ సంఘానికి ప్రొడక్షన్ ప్లాన్ ఇచ్చి వస్త్రాలు కొనాలన్న సహకార సంఘ అధ్యక్షుడి విన్నపానికి సానుకూలంగా స్పందించారు. కేటీఆర్ కు పెట్టిన ఒక్క మెసేజ్ తో ఇంత కదలిక ఉండటం గొప్పనే చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/