ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకుల్లో తెలంగాణ మంత్రి కల్వకుంట్ల రామారావు పేరు కచ్చితంగా ఉంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఆయన.. రాజకీయాలతో పాటు అన్ని రకాల విషయాల మీదా స్పందిస్తుంటారు. ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా మామూలు వ్యక్తిలాగే కొన్ని పోస్టులు పెడుతుంటారు. వ్యక్తిగత విశేషాల్ని పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన తన ఫాలోవర్లందరిలోనూ ఆసక్తి రేకెత్తించే ఫొటో ఒకటి షేర్ చేశారు తాజాగా. ప్రస్తుతం కేటీఆర్ కు 44 ఏళ్లు కాగా.. తనకు 22 ఏళ్ల వయసు ఉన్నప్పటి ఫొటోను కేటీఆర్ షేర్ చేశారు.
తాను 22 ఏళ్ల వయసులో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నప్పటి ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి కేటీఆర్ పాత జ్ఞాపకాలను అందరితో పంచుకున్నారు.. లైసెన్స్ లో ఉన్న ఫోటోలో కేటీఆర్ నూనూగు మీసాలతో అమాయకంగా కనిపిస్తున్నారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని రవాణా విభాగం జారీ చేసిన ఈ లైసెన్స్ లో కేటీఆర్ వ్యక్తిగత వివరాలు ఉన్నాయి. పేరు.. కల్వకుంట్ల తారకరామారావు.. సన్నాఫ్ కే.చంద్రశేఖర్ రావు - జన్మస్థలం సిద్దిపేట్.. డేట్ ఆఫ్ బర్త్ 24.07.1976గా అని అందులో పేర్కొన్నారు. ఇంటి అడ్రస్ ఖైరతాబాద్ అని ఉంది.
ఈ డ్రైవింగ్ లైసెన్స్ 1998 నాటిదని.. అంటే గత శతాబ్దిలోనిది అని పేర్కొన్న కేటీఆర్.. ఈ లైసెన్స్ తన ఇంట్లో చాలా కాలం తర్వాత గుర్తించినట్లు వివరించారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు.. ‘మీరు మళ్లీ మీసాలు పెంచవచ్చు కదా’, ‘మీరు సినిమా హీరో అయ్యే అవకాశాన్ని మిస్ చేసుకున్నారేమో’ - ‘ఈ సమయంలో మీ నాన్నగారే కదా ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్?’ - ‘ఈ 22 ఏళ్ల యువకుణ్ని అస్సలు గుర్తు పట్టలేకున్నాం’ అంటూ కామెంట్లు పెట్టారు.