నిధుల ఫైట్: కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్

Update: 2021-09-15 05:20 GMT
తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన సవాళ్లు విసిరారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడితో రాజీనామాకు  తొడగొట్టారు. తెలంగాణకు ఇస్తున్న పన్నులు.. తెలంగాణ ఇస్తున్న పన్నులపై సవాళ్లు చేశారు. నిరూపించకపోతే రాజీనామాకు రెడీ అంటూ తొడగొట్టారు.  కేంద్రానికి పన్ను రూపంలో తెలంగాణ రూ .2.72 లక్షల కోట్లు అందిస్తోందని.. రాష్ట్రానికి రూ .1.42 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయని మంత్రి కేటీఆర్ ఎండగట్టారు.  దీనిని తప్పుగా నిరూపించాలని.. లేకపోతే నీ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని తాజాగా రాష్ట్ర బిజెపి చీఫ్ బండి సంజయ్ కుమార్‌పై కేటీఆర్ సవాలు విసిరారు.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుమారుడు, పాలక తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తాజాగా విరుచుకుపడ్డారు. బండి సంజయ్ తప్పు చేసినట్లు నిరూపిస్తానని.. ఆయన రాజీనామా చేయాలని...నిరూపించకపోతే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు.  రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నింటికీ కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయని 'పాదయాత్ర' సందర్భంగా బిజెపి నాయకుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చాడు.

గద్వాల్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ బిజెపిపై ఘాటైన దాడిని కేటీఆర్ చేశారు. కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న నిధులలో 50 శాతం మాత్రమే మోదీ ప్రభుత్వం తిరిగి ఇస్తోందని, మన ప్రజల చెమట, రక్తం ద్వారా సంపాదించిన డబ్బు కేంద్రం వాడుకుంటోందని... బిజెపి పాలిత రాష్ట్రాలకు మన డబ్బును కేంద్రం నిధుల రూపంలో ఇస్తోందని ఆరోపించారు. ఇది మన ప్రజలను దగా చేయడమేనన్నారు.

పన్నుల రూపంలో తెలంగాణ కేంద్రానికి ఇచ్చే డబ్బును ఉత్తర ప్రదేశ్, ఇతర వెనుకబడిన రాష్ట్రాలకు మళ్లిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ కోసం కనీసం ఒక్క మెడికల్ కాలేజీ, ఐఐఎం లేదా నవోదయ పాఠశాల మంజూరు చేయకపోవడంపై టిఆర్ఎస్ నేత కేంద్రంపై నిప్పులు చెరిగారు. తన వాదన కోసం సంజయ్‌ని లక్ష్యంగా చేసుకుని, రైతు బంధు, రైతు భీమా, రైతులకు ఉచిత 24 గంటల విద్యుత్ సరఫరా, ప్రతి గ్రామంలో నర్సరీలు, గ్రామాల్లో వైకుంఠధామాలు, హరిత హారం, కల్యాణలక్ష్మి/షాది ముబారక్ లేదా నెలవారీ సామాజిక భద్రత కోసం కేంద్రం చెల్లిస్తోందా అని కేటీఆర్ తాజాగా బండి సంజయ్ ను అడిగారు. వివిధ వర్గాల లబ్ధిదారులకు రూ.2,000 పెన్షన్ అందిస్తోందని తెలిపారు.

"తెలంగాణలో అమలు చేస్తున్న అన్ని పథకాలకు కేంద్రం నిధులు ఇస్తుంటే, బీజేపీ పాలిత కర్ణాటకలో అలాంటి పథకాలు ఎందుకు లేవు" అని ఆయన అడిగారు. జోగుళాంబ గద్వాల్ జిల్లాలో ఒకే రోజు రూ. 104 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేటీఆర్ ఈ సందర్భంగా బండి సంజయ్ తన పాదయాత్రలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Tags:    

Similar News