కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. సినీ ఫక్కీలో కన్నడనాట రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఫలితాలు వెలుడిన వెంటనే బీజేపీ 115 స్థానాలు లీడింగ్ లో ఉండడంతో...తమకు ఏ పార్టీ మద్దతూ అవసరం లేదని బీజేపీ నేతలు ప్రకటనలు గుప్పించేశారు. తాజాగా, కర్ణాటక ఎన్నికల పూర్తి ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 222 స్థానాలకు గానూ బీజేపీ ....104స్థానాలను కైవసం చేసుకుంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ కన్నడనాట అధికారం చేపట్టేందుకు అవసరైమన మ్యాజిక్ ఫిగర్ 112 కు అడుగు దూరంలో బీజేపీ నిలిచింది. మరోవైపు కాంగ్రెస్ 78 స్థానాల్లో గెలుపొందింది. కింగ్ మేకర్ అయిన జేడీఎస్....38 స్థానాల్లో గెలుపొంది. ఇతరులు 2 స్థానాల్లో గెలిచారు. తాజాగా, తాము కాంగ్రెస్ తో జతకట్టేందుకు సిద్ధమని జేడీఎస్ అధికారికంగా ప్రకటించింది. తాము కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమని కుమార స్వామి తెలిపారు. సాయంత్ర 5.30 నుంచి 6 గంటల మధ్యలో అపాయింట్మెంట్ ఇవ్వాలని గవర్నర్ కు కుమారస్వామి లేఖ రాశారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాలలో నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. బీజేపీకి జేడీఎస్ మద్దతిస్తుందని చాలాకాలంగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ కాంగ్రెస్ కు కుమార స్వామి మద్దతుపలికారు. తాను సీఎం అయ్యేందుకు సిద్ధమని సిద్ధరామయ్యతో అన్నారు. అంతకుముందు, కాంగ్రెస్ నేతలు....జేడీఎస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ను కలిసేందుకు రాజ్ భవన్ వెళ్లారు. సీఎం సిద్ధ రామయ్య తన రాజీనామాను గవర్నర్ కు సమర్పించారు. మరోవైపు, అత్యధిక మెజార్టీ ఉన్న తమకే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ పిలుపునివ్వాలని బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప అన్నారు. ప్రజాతీర్పును పక్కనబెట్టి కాంగ్రెస్ అధికారం కోసం పాకులాడుతోందని ఎద్దేవా చేశారు. జేడీఎస్ - కాంగ్రెస్ లు కలిసి బీజేపీని నిలువరించేందుకు ఎత్తుగడలు వేస్తున్నాయని ఆరోపించారు. తమ అధిష్టానం ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని యడ్యూరప్ప తెలిపారు.