కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొత్త ప్రేమపై ఆ పార్టీ నేతలే అవాక్కవుతున్నారు. హోరాహోరీగా సాగిన కన్నడ పోరులో అధికారాన్ని బీజేపీ కైవసం చేసుకోవడం, ఆ పరిణామంపై పోరాటం చేసి మరీ కాంగ్రెస్-జేడీఎస్ కూటమి అధికారం దక్కించుకునేలా ఇరు పార్టీల నేతలు చక్రం తిప్పడం తెలిసిన సంగతే. అయితే తమ కంటే తక్కువ సీట్లు వచ్చిన జేడీఎస్ తో కలిసి సాగేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ ఆ పార్టీ నేతలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏకంగా సొంత పార్టీ నేతలకంటే వారిపైనే వల్లమాలిన ప్రేమ చూపుతుండటం గమనార్హం.
కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన జేడీఎస్ నాయకుడు కుమారస్వామి డిప్యూటీ సీఎం పదవితో పాటు మంత్రివర్గ కూర్పుపై సోనియాగాంధీ - రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని మీడియాకు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ రాహుల్ తో పాటు సోనియాగాంధీతో సమావేశమై పదవుల పంపకంపై చర్చించేందుకు కుమారస్వామి ఢిల్లీ వెళ్లారు. మాజీ సీఎం సిద్ధరామయ్య - కాంగ్రెస్ నేతలు డీకే శివకుమార్ - జి. పరమేశ్వర కూడా ఢిల్లీ వెళ్లారు. అయితే ఇక్కడే వారి రాహుల్ షాక్ ఇచ్చారు. కర్ణాటక కాంగ్రెస్ నేతలకు ఆ అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు నిరాకరించారు. హెచ్‌డీ కుమారస్వామి కలిసిన తర్వాతే కలవాలని ఆదేశించకారు. దీంతో అవాక్కవడం కాంగ్రెస్ నేతల వంతు అయింది.
మరోవైపు కుమారస్వామి కామెంట్లపైనా కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. ఐదు సంవత్సరాలు తానే సీఎంగా ఉంటానని కుమారస్వామి ప్రకటించడంపై కొందరు కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. సీఎం పదవిపై గులాం నబీ ఆజాద్ ఇప్పటికే హామీ ఇచ్చారని కుమారస్వామి పేర్కొన్నారు. మొత్తానికి ఇరు పార్టీల మధ్య చిన్న చిన్న సమస్యలు నెలకొన్నాయనేది స్పష్టవుతోంది. మరోవైపు శాఖల విషయంలో కూడా పేచీ సాగుతున్నట్లు సమాచారం. ఆర్థిక - ఆరోగ్య - ప్రజా సంక్షేమ మంత్రిత్వ శాఖలను తన వద్దే ఉంచుకోవాలని కుమారస్వామి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ నేతలేమో.. హోం - విద్యుత్ శాఖలపై కన్నేశారు. డిప్యూటీ సీఎం పదవిని కూడా కాంగ్రెస్ కే ఇవ్వాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. లింగాయత్ కమ్యూనిటీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఉప ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నారు.