సినీనటీమణులుగా సుపరిచితులైన కుష్బూ.. గౌతమిలకు తాజాగా జరుగుతున్నతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని షాక్ తగిలింది. ఇంతవరకు వారు కన్న కలలు కల్లలుగా మారాయి. ఇప్పటివరకు చేసుకున్న ఏర్పాట్లను ఆపేసి.. బరిలో నుంచి వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి. పార్టీ మీద పెట్టుకున్న ఆశలు నెరవేరకపోగా.. ఊహించని షాకులు తగిలినట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్ నేతగా తమిళనాడు రాజకీయాల్లో నిలదొక్కునేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. కాంగ్రెస్ తో కాదని భావించిన ఆమె.. బీజేపీలో చేరారు.
పార్టీ అభ్యర్థిగా చేపాక్కంలో కానీ ట్రిప్లికేన్ లో కానీ తాను పోటీ చేస్తానని ఆమె కలలుకన్నారు. ఈ రెండు చోట్లలో ఏదో ఒక చోట పార్టీ టికెట్ ఖాయమని భావించిన ఆమె.. అందుకు తగ్గట్లే భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. సినిమా సెట్ ను తలపించేలా భారీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయటంతో పాటు.. నాలుగు కంటైనర్లను తెప్పించి.. అన్ని వసతులు ఉండేలా ఏర్పాట్లు చేశారు. పొత్తులో భాగంగా ఆ రెండు స్థానాలు అన్నాడీఎంకే దక్కించుకోవటంతో ఆమెకు నిరాశ తప్పలేదు.
కుష్బూకు ఎదురైన చేదు అనుభవమే ప్రముఖ నటి గౌతమికి ఎదురైంది. బీజేపీలో చేరిన ఆమెకు.. రాజపాళయం పార్టీ ఇన్ చార్జిగా నియమించారు. దీంతో.. ఆమె అక్కడ నుంచి పోటీ చేయాలని తపించారు. ఇందుకోసం నెలల తరబడి ఆ నియోజకవర్గంలో ఆమె చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ఆర్నెల్లు
ఇంటికి దూరంగా.. నియోజకవర్గంలో ఉంటూ అక్కడి సమస్యల మీద అవగాహన పెంచుకున్న ఆమె.. తాను బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగటం ఖాయమని భావించారు. కానీ.. అన్నాడీఎంకే ఆ స్థానం నుంచి తన అభ్యర్తిని నియమించటంతో బీజేపీ తరఫున పోటీ చేయలేని పరిస్థితి. ఇలా టికెట్ కోసం కలలు కన్న ఇద్దరు ప్రముఖ నటీమణులకు తాజాగా నిరాశే ఎదురైంది. వీరిద్దరే కాదు.. పలువురు బీజేపీ నేతలు పోటీ చేస్తామని భావించిన పలువురు నేతలకు నిరశ తప్పలేదు. మరి..వీరికి వేరే స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఇస్తారా? లేదంటే.. తర్వాతి ఎన్నికల వరకు వెయిట్ చేయాలో.. కాలమే దీనికి సరైన సమాధానం చెప్పగలదు.