సంచలన వ్యాఖ్యలకు పెట్టింది పేరైన లక్ష్మీపార్వతి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.పవన్ కళ్యాణ్.. నందమూరి బాలకృష్ణ రాజకీయాల్లో విజయవంతం కాలేరని ఆమె తేల్చేశారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదన్న ఆమె.. బాలయ్య అమాయకుడని..ఆయనకు పార్టీ నడిపేంత శక్తి లేదని వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న చిరంజీవే రాజగకీయాల్లో నిలదొక్కుకోలేకపోయాడని.. పవన్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసినా నిలవడం సాధ్యం కాదని ఆమె అన్నారు. పవన్ కూడా చాలామందిలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి చేతిలో మోసపోయాడని ఆమె వ్యాఖ్యానించారు. బాలయ్య గురించి లక్ష్మీపార్వతి స్పందిస్తూ.. అమాయకుడైన బాలయ్యకు పార్టీ నడిపేంత శక్తి లేదన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డిపై లక్ష్మీపార్వతి ప్రశంసల జల్లు కురిపించారు. ఒకప్పుడు దేవతలు క్షీరసాగ మథనం చేస్తే ముందు విషమే వచ్చిందని.. అయినా దేవతలు అమృతం సాధించే వరకు విశ్రమించలేదని.. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా అనుకున్నది సాధించేవరకు పోరాడతాడని ఆమె అన్నారు. జగన్ లాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారని.. లక్ష్యాన్ని చేరే వరకు పోరు విరమించరని ఆమె అన్నారు.
చిన్నపిల్లాడైన జగన్ తండ్రిని కోల్పోయిన బాధలో ఉంటే.. సోనియా గాంధీతో కలిసి అతడిపై కేసులు వేయించిన దుర్మార్గుడు చంద్రబాబు అని.. కనీసం జగన్ కు నిలదొక్కుకునే అవకాశం లేకుండా చేసి.. జైలుకు పంపించారని ఆమె అన్నారు. వేల కోట్లు దోచుకుంటున్న తెలుగుదేశం పార్టీ నేతలు జగన్ మీద అవినీతి ఆరోపణలు చేసే ముందు తమ మనసుల్ని ప్రశ్నించుకోవాలని అన్నారు. తనను అందరూ అవమానించి రోడ్డు మీద నిలబెట్టిన సమంయలో జగన్ ఓ కొడుకులా తనను ఆదరించి.. తనకు పోరాడేందుకు ఓ వేదిక కల్పించాడని లక్ష్మీపార్వతి కొనియాడారు.