ఈ సమాజంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న ఆడపిల్లపై జరిగే అఘాయిత్యాలని మాత్రం ఆపలేకపోతున్నారు. ప్రతి రోజు ఎక్కడో ఒక చోట అమాయకమైన ఆడపిల్లలు , కామాంధుల చేతుల్లో పడి నలిగిపోతున్నారు. కన్నవారికి శోకాన్ని మిగిల్చి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. నాడు ఢిల్లీలో బస్సు లోనే అమ్మాయి పై అఘాయిత్యం చేస్తే ..హాస్పిటల్ లో ప్రాణాలతో పోరాడి చివరికి విధిని ఎదిరించలేక నిర్భయ పైలోకాలకి వెళ్ళిపోయింది. ఈ ఘటన ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. దీనితో ఇకపై అమ్మాయిల పై అఘాయిత్యాలకు పాల్పడకుండా నిర్భయ చట్టాన్ని తెచ్చారు. కానీ , ఆ నిర్భయ చట్టం ఉన్నప్పటికీ .. కామాంధులు ఆడపిల్లల జీవితాలని చిదిమేస్తున్నారు.
తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లో 19 ఏళ్ల అమ్మాయిని కొంతమంది సామూహిక అత్యాచారం చేసి .. అక్కడే చంపేసి వెళ్లిపోయారు. ఆ అమ్మాయి పుట్టిన రోజు నాడే ఈ ఘటన జరగడంతో తల్లిదండ్రలని పడటం ఎవరితరం కాలేదు. పుట్టినరోజు నాడే కానరాని లోకాలకి వెళ్లిపోయావా అంటూ రోదిస్తున్నారు. అతి దారుణంగా ..రేప్ చేసి ఆ తరువాత హత్య చేసి రోడ్డుపక్కన పడేసి వెళ్లిపోయారు. స్థానికుల సమాచారం తో పోలీసులు రంగంలోకి దిగి అనుమానాస్పద మృతిగా భావించి కేసు నమోదు చేశారు.
పూర్తి వివరాలు చూస్తే .. దీనదయాళ్‌నగర్‌లో ఈ అమ్మాయి తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. బుధవారం తన పుట్టిన రోజు కావడంతో గుడికి వెళుతున్నానని అమ్మ కి చెప్పి, ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన కూతురు ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆమె ఫోన్ కి కాల్ చేసారు. కానీ , ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. కంగారు పడిన కుటుంబ సభ్యులు, బంధువులు చాలా చోట్ల వెతికారు. అయినప్పటికీ ఆ యువతి జాడ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత రాత్రి 10 గంటల సమయంలో హంటర్‌రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్స్ సమీపంలో ఓ యువతి మృతదేహం ఉందని పోలీసులకి సమాచారం అందింది.
దీనితో ఆ అమ్మాయి బంధువులకి సమాచారం అందించి అక్కడికి రమన్నారు. కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని విగతజీవిగా పడి ఉన్న తన కూతురును చూసి .అక్కడే కూలిపోయారు. పుట్టిన రోజే .. నీకు ఆఖరి రోజైందా అమ్మా అంటూ ఏడుస్తుంటే ..వారిని ఆపడం ఎవరితరం కాలేదు. ఘటనా స్థలానికి కొద్ది దూరంలో బీరు సీసాలు, అమ్మాయి చెప్పులు లభించాయి. దీనితో ఈ అమ్మాయిని ఎవరో అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా , మర్మాంగం నుంచి మాత్రం తీవ్ర రక్త స్రావం జరిగినట్లు గుర్తించారు. దీనితో ఆ యువతి పై సామూహిక అత్యాచారం జరిగినట్లు భావిస్తున్న పోలీసులు , ఆ అమ్మాయి స్నేహితులని పిలిచి విచారిస్తున్నారు. అలాగే అక్కడికి దగ్గర్లోని సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. హత్య జరిగిన ప్రాంతం చాలా చీకటిగా ఉంటుంది. దీనితో చీకటిగా ఉన్న సమయంలో ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడ్డారా ? ఏది ఏమైనా ఆ అమ్మాయికి తెలిసిన వారి పనేనా ? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు ఆ విధంగానే విచారణని ప్రారంభించారు.