ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కాలంలో ఏ సినిమా రిలీజ్ అవుతున్నా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారుతోంది. ఏపీలో ఒక్కో సినిమాకు ఒక్కోలా షరతులు - పరిమితులు ఉంటాయయేమో అనే సందేహాలు కలిగేలా చేస్తోంది.
గతేడాది ఏప్రిల్ లో టికెట్ ధరలు నియంత్రిస్తూ ఏపీ సర్కారు జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇకపై ఏ సినిమాకైనా ఒకే రేటు ఉండాలని.. అదనపు షోలకు అవకాశమే లేదని తేల్చి చెప్పింది. అయితే ఆ తర్వాత రిలీజ్ అయిన కొన్ని సినిమాల విడుదల సమయంలో చూసీ చూడనట్టుగా వ్యవహరించింది.
కానీ 'శ్యామ్ సింగరాయ్' 'భీమ్లా నాయక్' వంటి సినిమాల విషయంలో మాత్రం స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో అయ్యారు. ఓ సినిమా విడుదలప్పుడు థియేటర్ల మీద తనికీలు చేస్తే.. మరో మూవీ రిలీజ్ కి అదనపు షోలు - అధిక రేట్లు లేవంటూ కొరడా జులుపించారు. ఈ మేరకు నోటీసులు జారీ చేయడమే కాదు.. రెవెన్యూ అధికారులు - పోలీసులు దీనిని ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తూ వచ్చారు.
కానీ ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' విడుదల నేపథ్యంలో ఏపీలో ఎలాంటి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ కనిపించడంలేదు. ఐదు షోలకు మాత్రమే అనుమతి ఉండగా.. పలు చోట్ల ఆరేడు ఆటలు ప్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 3-4 గంటలకే బెనిఫిట్ షోలు వేసుకున్నారు.. తెల్లారుజమున, ఉదయం 6 గంటలకే మొదటి షో ప్రదర్శించారు.
RRR చిత్రాన్ని ప్రత్యేకంగా పరిగణిస్తూ మొదటి పది రోజులు టికెట్ రేట్లు పెంచుకుడానికి ప్రభుత్వం పెర్మిషన్ ఇచ్చింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ శాతం థియేటర్లలో ఆన్ లైన్ బుకింగ్స్ ని అందుబాటులోకి తీసుకురాకుండా.. కౌంటర్స్ లోనే టికెట్ అమ్మకాలు జరిపారు. నిర్దేశించిన ధరలకు కాకుండా ఇష్టమొచ్చినట్లు అమ్మేశారు.
కౌంటర్ లోనే ఎక్కువ రేట్లు అమ్ముతే.. ఇక బ్లాక్ టికెట్ దందా వ్యవహారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇష్టానుసారంగా ఎక్కువ రేట్లకు టికెట్లు విక్రయించారు. సామాన్యుడికి తక్కువ రేటుకు వినోదం అందించడం ఏమో కానీ.. సినీ అభిమానుల జేబులకు మాత్రం చిల్లులు పడ్డాయి.
ప్రభుత్వం కళ్లు మూసుకోమందో.. చూసీ చూడనట్లుగా ఉండమని అధికారులకు సూచించారో తెలియదు కానీ.. RRR విడుదల వేళ బ్లాక్ మార్కెట్ దందా విచ్చలవిడిగా నడిచింది. మొత్తం మీద ఏపీలో మొన్నటి వరకు ఉన్న రూల్స్ ఈరోజు కనిపించలేదు. భీమ్లా టైంలో చేసిన హడావిడి ఇప్పుడు లేదు.
దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కొందరు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. అప్పుడు పవన్ మీద కక్ష పూరితంగా వ్యవహరించారనేది ఇప్పుడు ప్రజలందరికీ అర్థం అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు.
'రాధేశ్యామ్' చిత్రానికి బెనిఫిట్ షోలు వేయనీయకుండా.. RRR కు అనుమతి ఇవ్వడంపై ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఫైర్ అవుతున్నారని తెలుస్తోంది. ఇలా ఒక సినిమాకి ఒకలా ఇంకో సినిమాకు మరోలా వ్యవహరించడంపై సినీ ప్రియులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.