కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పట్టించుకునే మహిళలు తమ ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు. మతి మరుపు, పొట్ట పెరగడం, మొహం పై మొటిమలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే... ఇంట్లో పని ఒత్తిడి వల్ల మతిమరుపు వస్తుందేమో, నెలసరి సమయం కాబట్టి మొటిమలు వస్తున్నాయోమే, ఇంట్లోనే తిని కూర్చోవడం వల్ల పొట్ట పెరుగుతుందేమో అని భావిస్తారే తప్ప మరే ప్రమాదమూ లేదనుకుంటారు.
కానీ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. కచ్చితంగా వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా వేలాడే భారీ పొట్ట, మొహంపై మొటిమలు, నలుపెక్కడం, జుట్టు రాలిపోవడం, మతి మరుపు వంటి సమస్యలు వస్తే... కుషింగ్స్ వ్యాధిగా గుర్తించాలని చెబుతున్నారు. ఏంటీ కుషింగ్స్ వ్యాధి.. మేం ఈ పేరెప్పుడు వినలేదు అనుకుంటున్నారా.. నిజమేనండి. ఈ కుషింగ్ వ్యాధి వస్తే కచ్చితంగా వైద్యులను సంప్రదించాల్సిందే.
దాదాపు 90 సంవత్సరాల క్రితం అంటే 1932లో ఈ వ్యాధిని న్యూరో సర్జన్ పితామహుడు కుషింగ్ గుర్తించారు. ఆయన పేరు మీదుగానే ఈ వ్యాధికి కుషింగ్స్ అనే పేరొచ్చింది. అయితే ఈ డిసీజ్ పై చాలా మందికి అవగాహన లేదు. మెదడులోని పిట్యూటరీ గ్రంథి, మూత్ర పిండం మీద ఉండే అడ్రినల్ గ్రంధి మీద కణితి ఏర్పడి పెద్ద మొత్తంలో అడ్రినో కార్టికోట్రోపిక్ హార్మోన్‌ను విడుదల చేసినప్పుడు కుషింగ్స్ వ్యాధి వస్తుందట.
కుషింగ్స్.. వ్యాధి సోకినప్పుడు మొహంపై మొటిమలు రావడం, ముఖం నల్లగా మారిపోవడం, మెడ వెనుక అదనపు కొవ్వు చేరి గూని లాగా ఏర్పడటం, పొత్తి కడుపు చుట్టూ విపరీతంగా కొవ్వు చేరడం, రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరగడం లేదా హైపర్ గ్లూసేమియా, అధిక దాహం, అలసట, ఒత్తిడి, అతి మూత్ర విసర్జన, తలనొప్పి, విపరీతమైన మతిమరుపు, అధిక రక్తపోటు, అవాంఛిత రోమాలు, నెలసరి సమయాల్లో మార్పులు వంటివి వస్తాయి. అలాగే పురుషుల వంధ్యత్వానికి దారి తీస్తుంది.
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఎండోక్రినాలజిస్ట్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. మూత్రం, రక్తం, హార్మోన్ల పరీక్ష ద్వారా కుషింగ్స్ వ్యాధిని గుర్తింవచ్చు. అలాగే మెదడు, కిడ్నీపైన ఉన్న కణితిని గుర్తించేందుకు సీటీ స్కాన్ లేదా ఎంఆర్‌ఐ పరీక్షలు అవసరం. ఒక వేళ కణితి పెద్దదిగా ఉంటే ఆపరేషన్ కూడా చేయించుకోవాల్సి వస్తుంది. క్రమం తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలి.