అవును. ఇది టీడీపీలో సీనియర్ల కోరస్ గా ఉంది అంటున్నారు. చంద్రబాబు టీడీపీకి జాతీయ అధ్యక్షుడు. ఆయనే ముందుండి మొత్తం 2024 ఎన్నికలను నడిపించాలని సీనియర్ నేతలు సూచిస్తున్నారు అని టాక్. చంద్రబాబు నిజానికి దూకుడుగానే ఉన్నారు. నో రిటైర్మెంట్ అని బరిలోకి దూకుతున్నారు. కానీ ఆయనకు చినబాబు తోడుగా ఉన్నారు. కొన్ని బాధ్యతలను తాను తీసుకుంటున్నారు కూడా.
అయితే ఏపీలో 2024 ఎన్నికలు టీడీపీకి చాలా కీలకం అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ టైం లో చినబాబుని ముందు పెడితే అది ఒక ప్రయోగమే అవుతుంది అన్నది సీనియర్ల సలహాగా చెబుతున్నారు. చినబాబు అంటే వైసీపీ చాలా పంచులు వేస్తుంది. లైట్ తీసుకుంటుంది. జనాలలో టీడీపీని కూడా అలా పలుచన చేస్తుంది.
దాంతో ఎంత ఊపు వచ్చినా ఈ నెగిటివిటీ ముందు కొట్టుకుపోతుంది అన్నదే సీనియర్లతో పాటు తలపండిన వారి కలవరంగా ఉంది అంటున్నారు చంద్రబాబు వయసు ఇపుడు డెబ్బై రెండేళ్ళు. వచ్చే ఎన్నికల నాటికి మరో రెండెళ్లు వచ్చి కలుస్తాయి. అయినా చంద్రబాబు హెల్త్ రిత్యా చూసుకుంటే స్ట్రాంగ్ గానే ఉన్నారు.
ఆయన మాట జోరు కానీ వ్యూహాల పదును కానీ ఎక్కడా తగ్గింది లేదు. మరో పదేళ్ళు ఈజీగా ప్రత్యక్ష రాజకీయాల్లో చంద్రబాబు తన స్పీడ్ చూపించగలరని ఆయనని ఎరిగిన వారు అంతా నిబ్బరంగా చెబుతారు. అయితే ఇపుడు చూస్తే పార్టీలో లోకేష్ బాబు హుషార్ ఎక్కువ అయిపోతోంది అంటున్నారు.
దాంతో చంద్రబాబు కూడా పుత్ర ప్రేమను బాగా చూపించేస్తున్నారు అని ప్రచారంలో ఉంది. ఈ మధ్య జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల విషయమే తీసుకుంటే గెలుపు ఆశలు ఉన్న ఏపీలో పార్టీ కార్యక్రమాలు అన్నీ చినబాబే లీడ్ చేశారు. చంద్రబాబు హైదరాబాద్ కే పరిమితం అయ్యారు.
దీన్ని చూసిన తరువాతనే సీనియర్లు ఒక్కొక్కరుగా కూడబలుక్కుంటున్నారు అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వమే శ్రీరామరక్ష అవుతుందని, జనాలు కూడా బాబు అనుభవానికి దక్షతకు ఓటేస్తారు అని సీనియర్లు అభిప్రాయపడుతున్నారుట. అదే సమయంలో ఎన్నికల్లో క్యాండిడేట్లను డిసైడ్ చేసే విషయం నుంచి ప్రచార బాధ్యతలు అన్నీ కూడా చంద్రబాబే చూసుకుంటే బెటర్ అన్న భావన కూడా పార్టీలో వ్యక్తం అవుతోంది.
మరి దీనికి చంద్రబాబు ఎంతవరకూ అంగీకరిస్తారో చూడాలి. దాని కంటే ముందు యమ జోరు మీద ఉన్న లోకేష్ బాబు వచ్చే ఎన్నికల్లో అంతా నేనే అంటూ సౌండ్ చేస్తున్న వేళ తగ్గుతారా అన్న దాని మీద కూడా చర్చ ఉందిట. ఇప్పటికే ఆవిర్భావ దినోత్సవ వేళ చినబాబు చేసిన కొన్ని కామెంట్స్ నెగిటివ్ అయ్యాయని పార్టీలో చర్చ సాగుతోంది.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే వైసీపీ నేతలను వదిలిపెట్టే సీన్ లేదని చినబాబు వార్నింగ్ ఇవ్వడం వల్ల మంచి కంటే చెడే ఎక్కువ అవుతుంది అంటున్నారు. ఏ పార్టీ అయినా జనాలకు మేలు చేస్తామని చెప్పి అధికారంలోకి రావాలి తప్ప ప్రతీకారం తీర్చుకుంటామని అంటే బూమరాంగ్ అవుతుంది అని సీనియర్లు మధన పడుతున్నారు. మరో వైపు లోకేష్ త్వరలో ఏపీవ్యాప్తంగా పర్యటనలు మొదలెడతారు అని వార్తలు వస్తున్న క్రమంలో సీనియర్లు చంద్రబాబే ముందుండాలని కోరడం విశేషం. చూడాలి మరి ఏం జరుగుతుందో.