రేవంత్ సీఎం అయితే.. ఉప్పెనేనా?

Update: 2022-02-20 02:30 GMT
తెలంగాణ‌లో రాజ‌కీయాలు మారే చాన్స్ ఉందా?  ఏకంగా.. అధికారం కూడా మారిపోయే ప‌రిస్థితి ఉందా? అం టే.. ఉంద‌నే వ్యాఖ్య‌లు విశ్లేష‌కులు వినిపిస్తున్నాయి. అంతేకాదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ని కూడా అంటున్నారు.

ఇదే జ‌రిగితే.. ప్ర‌స్తుత కాంగ్రెస్ చీఫ్, ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి.. ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. అయితే.. అధికారం మారినా ఫ‌ర్వాలేదు కానీ.. రేవంత్ సీఎం అయితే.. అధికార పార్టీకి చుక్క‌లు క‌నిపిస్తాయ‌ని చెబుతున్నారు.

ముఖ్యంగా అధికార పార్టీ అవినీతిని రేవంత్ 70 ఎంఎం స్కోప్‌లో తెర‌మీదికి తెస్తార‌ని.. ఆయ‌న త‌ర‌చుగా చేసే వ్యాఖ్య‌ల‌ను ఖ‌చ్చితంగా నిరూపించే ఛాన్స్ ఉంద‌ని కూడా అంటున్నారు. ప్ర‌స్తుతం కేసీఆర్ ప్ర‌భు త్వం అవినీతి తార‌స్థాయిలో చేరింద‌ని..కుటుంబం మొత్తం దో చుకుంటోంద‌ని.. రేవంత్ చెబుతున్నారు. ముఖ్యంగా కాళేశ్వ‌రం ప్రాజెక్టు వారికి ఏటీఎం మాదిరిగా మారిపోయింద‌ని రేవంత్ విమ‌ర్శిస్తున్న విష‌యం తెలిసిందే. అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వ ప‌ధ‌కాల్లోనూ తీవ్ర అవినీతి జ‌రుగుతోంద‌ని ఆయ‌న అంటున్నారు.

ఈ క్ర‌మంలో రేపు రేవంత్‌ ముఖ్య‌మంత్రి అయితే.. ఖ‌చ్చితంగా అధికార పార్టీకి ఎదురు దెబ్బ‌త‌గ‌ల‌డం ఖాయ‌మ‌ని.. సొంత పార్టీలోనే చ‌ర్చ సాగుతోంది. అవినీతి స‌హా.. టీఆర్ ఎస్ ఆర్థిక మూలాల‌పైనా..రేవంత్ దృష్టి పెట్ట‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. ప్ర‌తి విష‌యంలోనూ.. రేవంత్ ఇప్ప‌టికే.. అన్ని విష‌యాల‌ను నిశితంగా ప‌రిశీలిస్తున్నార‌ని.. ముఖ్యంగా అధికార పార్టీకి ఉన్న ప్ర‌ధాన ఆర్థిక మ‌ద్ద‌తు దారుల‌ను మొత్తంగా కూక‌టి వేళ్ల‌తో స‌హా బ‌య‌ట‌కు లాగుతార‌ని అంటున్నారు.

ఇలా.. అంద‌రి జాత‌కాల‌ను రేవంత్ ఖ‌చ్చితంగా బ‌య‌ట‌కు లాగుతార‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో వంద‌ల ఎక‌రాల‌ను ఇటీవ‌ల కేసీఆర్ త‌న మ‌న‌వ‌డి పేరుతో కొనుగోలు చేశారు.

ఈ క్ర‌మంలో వీటిపైనా.. కేసీఆర్‌ను ఇరుకున పెట్టేందుకు ఖ‌చ్చితంగా రేవంత్ ప్ర‌య‌త్నిస్తార‌ని.. వీటి వెనుక ఉన్న ఆర్థిక మూలాల‌ను కూడా బ‌య‌ట‌కు లాగడం ఖాయ‌మ‌ని చ‌ర్చ సాగుతోంది. 
Tags:    

Similar News