గ్యాంగ్ రేపు కేసులో ఎమ్మెల్యే కొడుక్కి బెయిల్ ఇవ్వంది అందుకేనా?

Update: 2022-07-27 07:54 GMT
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో మే 28న రుమేనియా బాలిక‌పై మొత్తం ఐదుగురు అత్యాచారం చేసిన సంగ‌తి తెలిసిందే. అమ్నేషియా ప‌బ్ లో ఫ్రెండ్స్ గెట్ టు గెద‌ర్ పార్టీకి హాజ‌రైన మైన‌ర్ బాలిక‌ను నిందితులు ట్రాప్ చేశారు.

అంతేకాకుండా కారులో ఎక్కించుకుని అసభ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డ‌మే కాకుండా జూబ్లీహిల్స్ లో నిర్మానుష్య ప్ర‌దేశానికి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. నిందితుల్లో ఒక కార్పొరేటర్ కుమారుడు, ఒక కార్పొరేష‌న్ చైర్మ‌న్ కుమారుడు ఉన్నారు. అలాగే బాలిక‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన వారిలో ఎమ్మెల్యే కుమారుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

కాగా ఈ కేసులో న‌లుగురు నిందితుల‌కు జువైన‌ల్ జ‌స్టిస్ బోర్డు జూలై 27న‌ బెయిల్ మంజూరు చేసింది. దాదాపు ఘ‌ట‌న జ‌రిగాక 48 రోజుల‌కు న‌లుగురు మైన‌ర్ల‌కు బెయిల్ ఇచ్చింది. అయితే ఎమ్మెల్యే కొడుక్కి మాత్రం బెయిల్ ఇవ్వ‌లేదు. అత‌డు కూడా మైన‌ర్ అయిన‌ప్ప‌టికీ గతంలోనే బెయిల్ కోసం హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశాడ‌ని.. అది ఇంకా హైకోర్టులో పెండింగ్ లో ఉంద‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే హైకోర్టు ఏ నిర్ణ‌యం తీసుకోకుండా తాము బెయిల్ ఇవ్వ‌డం స‌రికాద‌ని భావించిన జువైన‌ల్ జ‌స్టిస్ బోర్డు ఎమ్మెల్యే కొడుక్కి బెయిల్ నిరాక‌రించింది.

అలాగే బాలిక‌ను గ్యాంగ్ రేప్ చేసిన‌వారిలో ఏ1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్ కు బెయిల్ ఇవ్వ‌లేదు. ఇత‌డు మేజ‌రే కావ‌డంతో ప్ర‌స్తుతం జైలులో ఉన్నాడు.

కాగా న‌లుగురు మైన‌ర్లు గ‌తంలో బెయిల్ కోసం రెండుసార్లు ద‌రఖాస్తు చేసుకోగా జువైన‌ల్ జ‌స్టిస్ బోర్డు తిర‌స్క‌రించింది. ఈసారి మాత్రం ప‌లు ష‌ర‌తుల‌తో బెయిల్ మంజూరు చేసింది.

ఒక్కో మైనర్‌కు రూ. 5 వేల పూచీకత్తుపై బెయిల్‌ ఇస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు కేసులో విచారణకు సహకరించాలని, హైదరాబాద్ డీపీవో ముందు ప్రతి నెల హాజరు కావాలని జువైనల్‌ జస్టిస్‌ బోర్డు న‌లుగురు మైన‌ర్ల‌కు ప‌లు ష‌ర‌తులు విధించింది.
Tags:    

Similar News