ఊహించని రీతిలో బ్రిటన్ లో చోటు చేసుకున్న ఉగ్రదాడి ప్రపంచానికి షాకింగ్ గా మారింది. పార్లమెంటుకు సమీపంలో జరిపిన ఉగ్రదాడిలో ప్రాణనష్టం తక్కువగా కనిపించినప్పటికీ.. ఈ దాడి చేసిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. గగుర్పాటుకు గురి చేసేలా ఉగ్రదాడి చేసిన దుండగుడ్ని పోలీసులు కాల్పులు జరపటంతో.. తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి ప్రాథమిక చికిత్సలు జరిపిన తర్వాత ఘటనాస్థలంలోనే మృతి చెందారు. అతన్ని తరలిస్తుండగా తీసిన ఫోటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి.
బ్రిటన్ లో బీభత్సానికి తెగబడిన నిందితుడ్ని ఆసియాకు చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. సుమారు 40 ఏళ్ల వరకూ ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చేతులతో రెండు కత్తుల్ని ఇష్టారాజ్యంగా వాడిన వైనం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతేకాదు.. అతగాడు వినియోగించిన కారు విలువ దాదాపు రూ.26లక్షల మేర ఉండొచ్చన్న అంచనా వ్యక్తమవుతోంది.
హుందయ్ ఐ40 కారులో దూసుకొచ్చిన దుండగుడు.. వెస్ట్ మినిష్టర్ బ్రిడ్జ్ పై విచక్షణరహితంగా కారు నడిపి ఒక మహిళతో సహా నలుగురు మృతికి కారణమయ్యారు. నిందితుడికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాకున్నా..అతను ఉపయోగించిన విలాసవంతమైన కారు.. రిజిస్ట్రేషన్ చెందిన ప్రాంతాన్ని చూస్తే.. అతడు ఎస్సెక్స్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా అంచనా వేస్తున్నారు. ఇది కచ్ఛితంగా ఇస్లామిక్ ఉగ్రవాద దాడిగానే అంచనా వేస్తున్నారు. తమపై ఉగ్రవాద దాడి జరిగే ప్రమాదం పొంచి ఉందన్న వాదన వినిపిస్తున్న వేళలో.. ఈ ఘటన చోటు చేసుకోవటం బ్రిటన్ వాసులకు కొత్త బెంగగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/