సినిమాలు చూసి జనాలు ఏ విధంగా స్ఫూర్తి పొందుతున్నారో ఎన్నో సంఘటనలు నిరూపిస్తున్నాయి. తాజాగా అర్జున్‌రెడ్డి సినిమాను ఒకరు వైద్యుడినని చెప్పుకుని అమాయకులైన అమ్మాయిలను మోసం చేసిన ఘటన న్యూఢిల్లీలో జరిగింది. బాలీవుడ్ సినిమా కబీర్ సింగ్ (అర్జున్ రెడ్డి రీమేక్) చూసి నిందితుడు స్ఫూర్తి పొందాడని పోలీసులు గుర్తించారు. తాను వైద్యుడినని చెప్పుకుంటూ ఒకరు అమాయక యువతులను మోసం చేసి ఇప్పుడు కటకటలా పాలయ్యాడు.
ఢిల్లీ పోలీసులు శుక్రవారం వివరాలు వెల్లడించారు. ఢిల్లీకి చెందిన ఆనంద్ కుమార్ కబీర్ సింగ్ సినిమాలోని ఆర్థోపెడిక్ సర్జన్ షాహిద్ కపూర్ పాత్రతో స్ఫూర్తి పొందాడు. తానో ఆర్థోపెడిక్ సర్జన్‌నని చెప్పుకుంటూ.. డాక్టర్ రోహిత్ గుజరాల్ అనే మారు పేరుతో టిండర్ డేటింగ్ యాప్ ద్వారా అమాయక యువతులకు ఎర వేశాడు. ఈ నేపథ్యంలో నకిలీ వైద్యుడి వలలో చిక్కింది.
ఆ యాప్ ద్వారా అమ్మాయిలతో చాటింగ్ చేసి వారిని వలపు మాయలో తీసుకెళ్లాడు. వారితో చాటింగ్ చేస్తూ మెల్లగా వారికి దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే ఓ యువతిని కుమార్ పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. అతడ్ని పూర్తిగా నమ్మిన ఆ యువతి దాదాపు 30 వేల రూపాయలు అతడి బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసింది. కొన్నాళ్లకు ఆమె ప్రైవేటు చిత్రాలు, వీడియోలు తీసుకున్నాడు. ఇద్దరు రహాస్యంగా మాట్లాడుకున్నారు. అయితే కొద్ది రోజుల తర్వాత ఆ యువతి ఆనంద్ పై అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ఆమెను ప్రశ్నించగా ఆమెకు చెందిన ప్రైవేట్ చిత్రాలు, వీడియోలు బయటపెడతానంటూ బ్లాక్ మెయిల్ చేయసాగాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆనంద్ తో పాటు అతడికి సహకరిస్తున్న మరో యువకుడ్ని అరెస్ట్ చేశారు. ఈ విధంగా సినిమాను స్ఫూర్తిగా తీసుకుని నేరాల పాల్పడుతున్న వారి సంఖ్య చాలానే ఉంది.