సాధారణంగా యువతీయువకుల కోసం స్వయంవరం నిర్వహించడం మనం చాలా సార్లు చూసేవుంటాం. కానీ, ఇప్పుడు 50 నుండి 90 ఏళ్ల వయస్కులకు కూడా స్వయంవరం జరిగింది. అది ఎక్కడో కాదు.. మన హైదరాబాద్ లో . అసలు పెద్దల స్వయంవరం.. వినడానికి ఆశ్చర్యంగా ఉంది. ఎల్డర్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్, తోడు నీడ, అనుబంద్ ఫౌండేషన్, సాకేత్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లన్నీ కలిసి ఈ పెద్దల స్వయంవరాన్ని నిర్వహించాయి.
ఆదివారం దోమల్ గూడలోని ఏవీ కళాశాల లో నిర్వహించిన పెద్దల స్వయంవరానికి విశేష స్పందన లభించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో పెద్దలు హాజరయ్యారు. 50-90 ఏళ్ల వయసున్న పెద్దల్లో అసలు పెళ్లి కానివారు, జీవిత భాగస్వామిని కోల్పోయిన వారు, విడాకులు తీసుకున్న వారు దాదాపు 400 మంది వరకు వచ్చారు. అలాగే, తమ భర్తల చేతిలో మోసపోయిన మహిళలు - భార్యలు మోసగించిన భర్తలు భార్యలు చనిపోవడం తో పిల్లలు పట్టించుకోని భర్తలు - భర్తలు చనిపోవడంతో ఎలాంటి ఆధారం లేని మహిళలు ...ఈ స్వయంవరంలో పాల్గొన్నారు.
ఈ స్వయంవరంలో చాలామంది తమ మనసుకు నచ్చినవారిని ఎంచుకున్నారు. ఆ తర్వాత వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత ఒప్పంద తేదీని ఖరారు చేసి రిజిస్ట్రార్ సహాయం తో ఉచితంగా వివాహం చేసేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ, ఒక వయసు లో జీవిత భాగస్వామిని కోల్పోయిన స్త్రీలు, పురుషులు ఒంటరిగా జీవించలేక ఎంతో బాధ పడుతుంటారని చెప్పారు. అలాంటి పెద్దలు నిస్సంకోచంగా మళ్లీ పెళ్లి చేసుకోవడానికి అర్హులని తెలిపారు. కాగా, ఈ స్వయంవరంలో పాల్గొన్నవారిలో ఓ జంట అక్కడే , అందరి సమక్షంలో ఒక్కటయ్యారు. ఇరిగేషన్ శాఖలో విధులు నిర్వహించి రిటైరైన ఈశ్వర్ ప్రసాద్, విజయ అనే మహిళను ఇష్టపడ్డారు. ఒకరికొకరు ఇష్టపడటం తో వారికే అక్కడే వివాహం చేసారు.