భారత్- పాక్ మధ్య సాగుతున్న ఉద్రిక్తతలు ఒక కొలిక్కి వచ్చినట్లుగా చెప్పక తప్పదు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం.. అందుకు ప్రతిగా జైష్ ఎ మహ్మద్ స్థావరాలపై భారత వైమానిక దళం మెరుపుదాడులు చేయటం.. ఆ తర్వాత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారటం తెలిసిందే.
తమ దేశంలో జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజార్ లేరన్నట్లు మాట్లాడిన పాక్.. తాజాగా మాట మారుస్తూ.. అతడు తమ దేశంలోనే ఉన్నాడని.. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. అంతేకాదు.. భారత మెరపుదాడుల కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లలేదని.. ఎవరూ మరణించలేదని పాక్ చెప్పింది. ఇదిలా ఉంటే.. తాజాగా జైష్ ఎ మహ్మద్ అధినేత మసూద్ అజార్ సోదరుడు మౌలానా అమర్ మాటలకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి బయటకు వచ్చింది.
ఇది.. పాకిస్థాన్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లుగా మారుతుందని చెబుతున్నారు. ఎందుకంటే.. భారత్ జరిపిన యుద్ధ విమానాల దాడిలో తమ శిక్షణ శిబిరం మొత్తం నాశనమైందని ఒప్పుకున్నారు. అంతేకాదు.. ఇదే ఆడియోక్లిప్ లో పాక్ సైన్యం అదుపులోకి తీసుకున్న అభినందన్ వర్దన్ ను విడుదల పైనా అతను అసంతృప్తి వ్యక్తం చేయటం ఉంది.
భారత యుద్ధ విమానాలు పాకిస్థాన్ ఇళ్ల మీద బాంబులు వేయలేదు. జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన శిక్షణ కేంద్రాల మీద బాంబులు వేసింది. ఇక్కడ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తుంటామని పేర్కొన్నారు. మరోవైపు భారత వైమానిక దళాలు జరిపిన మెరుపుదాడుల్లో ఉగ్రవాదులు భారీగా హతమైనట్లుగా భారత సర్కారు పేర్కొంది. దీన్ని కొట్టి పారేసిన పాక్ కు.. తాజాగా మసూద్ సోదరుడి మాటలు ఇరుకున పడేలా చేయటమే కాదు.. అంతర్జాతీయ సమాజం ముందు మాటల కోసం వెతుక్కునే పరిస్థితి వచ్చిందని చెప్పక తప్పదు.